TTD Good News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు

అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనుంది.

Tirumala (File: Google)

Tirumala, March 4: తిరుమల (Tirumala) శ్రీవారిని కాలినడకన వెళ్ళి దర్శించుకునే వెంకన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) శుభవార్త  చెప్పింది. అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం (Divya darshanam) టోకెన్లు (Tokens) జారీ చేయనుంది. నడక మార్గాల్లో వచ్చే భక్తుల్లో 60 శాతం మంది వద్ద దర్శన టికెట్లు ఉండడం లేదని గుర్తించామని, కాబట్టి వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్  సాఫ్ట్‌ వేర్ రూపొందిస్తున్నామని, అది అందుబాటులోకి రాగానే టోకెన్ల జారీ ప్రారంభిస్తామన్నారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ లో నేడు రూ. 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు.. వెరసి ఇప్పటివరకూ వచ్చిన పెట్టుబడుల విలువ రూ. 13 లక్షల కోట్లు.. యువతకు రానున్న ఉద్యోగాలు 6 లక్షలు