Chittoor Shocker: చిత్తూరు జిల్లాలో దారుణం, పెళ్లి పేరుతో బాలికపై లైంగిక దాడి, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వివరాలను వెల్లడించిన ములకల చెరువు సీఐ సురేష్‌కుమార్‌

చిత్తూరు జిల్లాలో బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు (Two accused have been arrested) చేసి రిమాండ్‌కు తరలించినట్లు ములకల చెరువు సీఐ సురేష్‌కుమార్‌ శనివారం తెలిపారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Chittoor, june 6: చిత్తూరు జిల్లాలో బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు (Two accused have been arrested) చేసి రిమాండ్‌కు తరలించినట్లు ములకల చెరువు సీఐ సురేష్‌కుమార్‌ శనివారం తెలిపారు.సీఐ కథనం మేరకు వైఎస్సార్‌ జిల్లా మిట్టపల్లెకి చెందిన బాలిక(17)ను గత నెల 12న తంబళ్లపల్లె మండలం పెండేరువారిపల్లె వద్ద మిట్టపల్లెకే చెందిన ఎస్‌. అశోక్‌కుమార్‌(19), అతడి అన్నయ్య ఎస్‌.శివయ్య(24), మామయ్య ఈశ్వరయ్య(56) తో కలసి కారులో వచ్చి కిడ్నాప్‌ చేశాడు. బాలిక బహిర్భూమికి వెళ్లిన సమయంలో వీరంతా కిడ్నాప్‌నకు (kidnapping and sexual assault of a girl in chittoor) పాల్పడ్డారు.

బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో తంబళ్లపల్లె ఎస్‌ఐ సహదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఎస్‌.అశోక్‌కుమార్, అతడి అన్నయ్య, మామయ్యపై కిడ్నాప్‌ కేసు నమోదు చేయడంతో భయపడి వారు బాలికను తంబళ్లపల్లె సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాలికను విచారించగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడి మోసం చేశాడని పోలీసులతో వాపోయింది. దీంతో నిందితులు ముగ్గురిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

కులాంతర వివాహం చేసుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి, బాడీని ఇంటికి తీసుకువస్తారని తాళం వేసుకుని ఎటో వెళ్లిపోయిన తల్లిదండ్రులు, కర్నూలు జిల్లా సున్నిపెంటలో విషాద ఘటన

కాగా అశోక్‌కుమార్‌(19), ఈశ్వరయ్య(56) వైఎస్సార్‌ జిల్లా చేర్లోపల్లె సమీపంలోని మామిడి తోటలో దాక్కొని ఉండగా అరెస్టు చేసి తంబళ్లపల్లెకు తీసుకొచ్చారు. శనివారం ములకలచెరువు సర్కిల్‌ కార్యాలయంలో ఇద్దరి వివరాలను పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు శివయ్య పరారీలో ఉన్నాడన్నారు.