Srinivasa Sethu Flyover Accident: తిరుపతి ఫ్లైఓవర్ పనుల్లో మరోసారి ప్రమాదం, సిమెంట్ దిమ్మె అమర్చుతుండగా తెగిన వైర్లు, ఇద్దరు కార్మికులు మృతి

శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనుల్లో క్రేన్లు వైర్లు తెగిపోయాయి. చివరి సిమెంట్ దిమ్మె అమర్చుతుండగా వైర్లు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

Srinivasa Sethu Flyover Accident (PIC@Twitter)

Tirupati, July 27: తిరుపతిలో ఫ్లైవోవర్ పనుల్లో (Srinivasa Sethu Flyover) ప్రమాదం జరిగింది. శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనుల్లో క్రేన్లు వైర్లు తెగిపోయాయి. చివరి సిమెంట్ దిమ్మె అమర్చుతుండగా వైర్లు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పశ్చిమ బెంగాల్, బీహార్ వాసులుగా గుర్తించారు. మరో వారం రోజుల్లో ఈ ఫ్లైవోవర్ (Srinivasa Sethu Flyover) నిర్మాణం పనులు పూర్తి కావాల్సివుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Andhra Pradesh: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ. 20 వేలు కాదు రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా, క్లారిటీ ఇచ్చిన ఏపీ రవాణా శాఖ కమిషనర్ 

సిమెంట్ సిమెంట్ దిమ్మెలతోనే ఫ్లైవోవర్ మొత్తాన్ని నిర్మిస్తున్నారు. ఇది తిరుపతి చరిత్రలోనే కీర్తి కిరీటంగా చెప్పవచ్చు. మొత్తం తిరుపతి ట్రాఫిక్ సమస్యకు పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టేందుకు గత మూడేళ్లుగా శ్రీనివాస సేతు ఫ్లైవోవర్ నిర్మాణం పనులు అత్యంత చురుకుగా సాగుతున్నాయి. ఫస్ట్ పేస్, సెకండ్ పేస్ పూర్తి అయింది. ఇక థర్డ్ పేస్ చిరవి దశలో మాత్రమే ఉంది. కచ్చితంగా ఆగస్టు మొదటివారంలో శ్రీనివాస్ సేతు ఫ్లైవోవర్ ను అట్టహాసంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మొత్తం ఫ్లైవోవర్ నిర్మాణంలో ఇది ఆఖరి సిమెంట్ సిమెంట్ దిమ్మె.

Andhra Pradesh Rains: భారీ వర్షాలకు విశాఖలో ఇళ్లలోకి చేరిన వరద నీరు, పూర్తిగా నీట మునిగిన జ్ఞానాపురం, వీడియోలు ఇవిగో.. 

సిమెంట్ సెగ్మెంట్ అమర్చి కాంక్రీట్ వేస్తే ఫ్లైవోవర్ పూర్తి అయిపోయినట్లే. అలాంటి ఆఖరి సిమెంట్ సెగ్మెంట్ ను క్రేన్ తో పైకి లేపి అమర్చుతుండగా ఒక్కసారిగా క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో దానికి వేలాడుతున్న భారీ సిమెంట్ దిమ్మ దాదాపు ముప్పై అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. అదే సమయంలో కిందనే ఉన్న ఇద్దరు కూలీలు ఘటనాస్థలంలోనే మరణించారు. పూర్తిగా సిమెంట్ దిమ్మ కింద ఇద్దరు నుజ్జునుజ్జు అయ్యారు. మరో క్రేన్ తో అత్యంత కష్టం మీద సిమెంట్ దిమ్మెను పక్కకు జరిపి మృతదేహాలను వెలికి తీశారు.ఘటనాస్థలానికి అధికారులు, ఎమ్మెల్యే చేరుకున్నారు. అసలు ఏం జరిగింది? అంత బరువులను లిఫ్ట్ చేస్తుండగా వైర్లు ఎలా తెగాయి? ముందే ఈ వ్యవహారాలను చూసుకోలేదా అన్న అంశాలపై అధికారులు సమీక్ష జరుపుతున్నారు.