Anna Canteen Torched: తెనాలిలో అన్నా క్యాంటీన్‌కు నిప్పు.. అర్ధరాత్రి నిప్పు పెట్టి పరారైన దుండగులు

అయితే, ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు.

Credits: Video Grab

Tenali, Dec 18: ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం (TDP Government) ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను (Anna Canteen) ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మూసివేసింది. మరింత మెరుగ్గా వాటిని నిర్వహిస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆచరణలోకి రాలేదు. దీంతో అన్నా క్యాంటీన్లు అన్నీ మూతపడ్డాయి. అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవాలంటూ ప్రతిపక్ష నేతలు (Opposition Parties) పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. అయినప్పటికీ వాటికి మోక్షం దక్కలేదు.

ఆంధ్రప్రదేశ్ స్కూళ్లలో విద్యా విధానంలో కీలక మార్పులు, ఇకపై సెమిస్టర్ పద్దతిలో పరీక్షలు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తాజాగా, గుంటూరు జిల్లా తెనాలిలో అలా మూతపడిన ఓ అన్నా క్యాంటీన్‌కు గత రాత్రి కొందరు దుండగులు నిప్పు పెట్టి కాల్చి బూడిద చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా బట్టలు విప్పేసి హోటల్‌ సిబ్బందిపై దాడి చేసిన విదేశీ మహిళ, జైపూర్‌ హోటల్‌లో రచ్చ రచ్చ చేసిన మహిళ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదుగోండి!

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif