Stone Pelting on Vande Bharat: మూడోసారి వందే భారత్ రైలుపై రాళ్ల దాడి, పగిలిపోయిన C8 కోచ్ అద్దాలు, విశాఖ నుంచి ఆలస్యంగా బయలుదేరిన రైలు

జైల్లో పెడతామని హెచ్చిరించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి (Stone Pelting on Vande Bharat) జరిగింది. బుధవారం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌పై (Vande Bharat Express) అగంతకులు రాళ్లదాడి చేశారు.

Stone Pelting on Vande Bharat (Photo-Twitter)

VJY, April 6: భారత రైల్వే శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. జైల్లో పెడతామని హెచ్చిరించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి (Stone Pelting on Vande Bharat) జరిగింది. బుధవారం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌పై (Vande Bharat Express) అగంతకులు రాళ్లదాడి చేశారు. ఖమ్మం-విజయవాడ మధ్యలో ఉన్న రైలుపై అంగతకులు రాళ్లు విసిరారు. దీంతో.. C8 కోచ్ అద్దాలు పగిలిపోయాయి.

నిన్న బర్రెలు, ఇవాళ ఆవులు, వందేభారత్ ట్రైన్‌కు మరో ప్రమాదం, ఆవు ఢీకొట్టడంతో ముందుభాగం డ్యామేజ్, వందే భారత్ ట్రైన్ క్వాలిటీపై విమర్శలు

కోచ్‌ మరమ్మత్తుల నేపథ్యంలో ఇవాళ(గురువారం) విశాఖ నుంచి రైలు ఆలస్యంగా బయలుదేరుతోంది. విశాఖ నుంచి 5.45కు బయలుదేరి వెళ్లాల్సిన వందే భారత్ ఆలస్యం..షెడ్యూల్ కంటే ఆలస్యంగా 9-.45కి బయలుదేరనుంది. గతంలోనూ ఈ రూట్‌లో వందే భారత్‌పై రాళ్ల దాడులు జరిగాయి. ఫిబ్రవరిలో ఖమ్మం రైల్వే స్టేషన్‌ సమీపంలో, అంతకు ముందు సైతం ఓసారి ఇలాగే దాడి జరిగింది. వరుసగా రైళ్లపై రాళ్ల దాడి జరగడంతో దక్షిణమధ్య రైల్వే సీరియస్‌గా స్పందించింది. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు ఇక ఆరు గంటలే, ఏప్రిల్ 8న సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ట్రైన్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రాళ్లదాడికి పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. అంతేకాదు.. ఇలా నేరం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన కేసుల్లో 39 మందిని అరెస్టు చేశారు కూడా. ఇదిలా ఉంటే.. శనివారం కొత్తగా సికింద్రాబాద్‌-తిరుపతి రూట్‌లో వందేభారత్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు