Kanakadurga Flyover: కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం నేడే, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా లాంచ్, తీరనున్న విజయవాడ వాసుల కష్టాలు
కనదుర్గ ఫ్లై ఓవర్ ను వర్చ్యువల్ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Union Minister nitin gadkari), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Amaravati, Oct 16: విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ (Vijayawada Kanakadurga Flyover) నేటి నుంచి అందుబాటులోకి రానుంది. కనదుర్గ ఫ్లై ఓవర్ ను వర్చ్యువల్ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Union Minister nitin gadkari), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) లాంఛనంగా ప్రారంభించనున్నారు. తన క్యాంప్ కార్యాలయం (CM Camp Office) నుంచి సీఎం జగన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఫ్లై ఓవర్ (Kanakadurga Flyover) ప్రారంభంతో పాటు రూ.7584 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులకు భూమిపూజ చేయనున్నారు.
ఇప్పటికే 8007 కోట్లతో పూర్తయిన 10 ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 15 వేల కోట్ల పనులకు నేడు భూమిపూజ, ప్రారంభోత్సవా కార్యక్రమాలు జరుపనున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరిగాక అధికారికంగా వాహనాలకు కూడా అనుమతిస్తారు.
దీంతో పాటు 2.6 కిలోమీటర్ల మేర దాదాపు రూ.325 కోట్ల వ్యయంతో సోమా ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. 46 స్పాన్లతో ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది.
Here's Vijayawada Kanakadurga Flyover Video:
2015 డిసెంబర్ 28 నుంచి పనులు మొదలుపెట్టారు. వాస్తవానికి రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తికావల్సి ఉన్నా పలు అవాంతరాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ ఫ్లైఓవర్‌ను సత్వరమే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించడంతో గడిచిన ఆరేడు నెలల్లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.