Vizag Woman Murder Case: రాత్రంతా ఇద్దరు ఒకే రూంలో, తెల్లారి రూ.2 వేలు దగ్గర గొడవ రావడంతో హత్య, వీడిన విశాఖ మహిళ హత్య కేసు మిస్టరీ, నిందితుడు అరెస్ట్

విశాఖపట్నం మధురవాడలోని వికలాంగుల కాలనీలో సంచలనం రేపిన మహిళ హత్య కేసు (Vizag Woman strangled to death) మిస్టరీ వీడింది. ప్లాస్టిక్‌ డ్రమ్ములో పుర్రె, అస్తిపంజరం ( chopped into pieces) బయటపడిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు

Vizag Police Commissioner CH. Srikanth ( Photo-Video Grab)

Vizag, Dec 7: విశాఖపట్నం మధురవాడలోని వికలాంగుల కాలనీలో సంచలనం రేపిన మహిళ హత్య కేసు (Vizag Woman strangled to death) మిస్టరీ వీడింది. ప్లాస్టిక్‌ డ్రమ్ములో పుర్రె, అస్తిపంజరం ( chopped into pieces) బయటపడిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చనిపోయిన యువతిని శ్రీకాకుళం జిల్లా మోదంటి వీధికి చెందిన బమ్మిడి ధనలక్ష్మి(24)గా గుర్తించారు.నిందితుడిని శ్రీకాకుళం జిల్లా మందస గ్రామానికి చెందిన దండు రిషివర్ధన్‌ అలియాస్‌ కొప్పిశెట్టి రిషివర్ధన్‌గా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ మంగళవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాదిలో వెల్డింగ్‌ దుకాణం నడుపుతున్న నండూరి రమేష్‌కు వికలాంగుల కాలనీలో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిని తన వద్ద పనిచేస్తున్న రిషికి 2020 సెప్టెంబర్‌లో అద్దెకు ఇచ్చాడు. నిందితుడు రిషివర్ధన్‌ తన భార్యతో కలిసి రమేష్‌ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. భార్య గర్భవతి కావటంతో 2021 జనవరిలో తన అత్తగారి ఊరైన శ్రీకాకుళం బల్లిగూడకు కాన్పు నిమిత్తం పంపించాడు. ఆ తరువాత తరచూ భార్యను చూసేందుకు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో 2021 మే 29న శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు కోసం వేచి ఉండగా.. బమ్మిడి ధనలక్ష్మి (24) అనే మహిళ పరిచయమైంది. ఇద్దరూ ఫోన్‌ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు.

విశాఖలో డ్రమ్ములో ముక్కలు ముక్కలుగా నరికిన యువతి మృతదేహం, భర్తే నరికి డ్రమ్ములో దాచిపెట్టాడనే అనుమానాలు, ఏడాది తర్వాత దారుణ ఘటన వెలుగులోకి..

అదే నెల 30న రిషికి ధనలక్ష్మి పలుమార్లు ఫోన్‌ చేసింది. తన భార్య ఇంటివద్ద లేదని రిషి చెప్పటంతో ధనలక్షి ఆ రోజు రాత్రి అతడి ఇంటికెళ్లింది. వేకువజామున 4.30 గంటల సమయంలో ధనలక్ష్మి రూ.2 వేలు కావాలని డిమాండ్‌ చేసింది. తన వద్ద 100 రూపాయలే ఉన్నాయని రిషి చెప్పగా.. అతడి భార్య దుస్తులు, టీవీ ఇమ్మని అడిగింది. అందుకు తిరస్కరించగా.. తాను అడిగినవి ఇవ్వకపోతే బయటకు వెళ్లి గొడవ చేస్తానని హెచ్చరించడంతో రిషి కోపంతో ఆమె మెడకు చున్నీ బిగించటంతో ప్రాణం (

Vizag Woman Murder Case) విడిచింది.

యూపీలో షాకింగ్ ఘటన, యజమానితో పందెంలో ఓడిపోవడంతో శీలాన్ని అమ్మేసుకున్న మహిళ,లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన ఆమె భర్త

మృతదేహాన్ని బ్లాంకెట్‌ ప్లాస్టిక్‌ జిప్‌ కవర్‌లో ప్యాక్‌ చేసి.. ఇంట్లోని ప్లాస్టిక్‌ డ్రమ్‌లో దించి మూతను సెల్లో టేప్‌తో మూసివేశాడు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయి తన సెల్‌ఫోన్‌ను 13 రోజులు స్విచ్ఛాఫ్‌ చేసి ఉంచాడు. ఆ తరువాత ఇంటిని ఖాళీ చేసిన రిషి వెల్డింగ్‌ షాపులో పని కూడా మానేసి తన అత్తగారింటికి వెళ్లిపోయాడు.

అయితే నిందితుడు గత కొంత కాలంగా అద్దె చెల్లించడం లేదు.అలాగే కరెంటు బిల్లును మే 2021 నుంచి చెల్లించకపోవడం, బిల్లు ఎక్కువగా వస్తుండటంతో రమేష్‌ ఆ ఇంటిని చూసేందుకు ఈ నెల 4వ తేదీన వెళ్లాడు.అక్కడ ఇంటికి తాళం వేసి ఉండగా.. ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇంటి వెనుక తలుపు తీసి ఉండటంతో లోపలకు వెళ్లి చూడగా.. ఓ పక్కన ప్లాస్టిక్‌ డ్రమ్ము టేప్‌తో సీల్‌ చేసి ఉండటం గమనించాడు, అది దుర్వాసన రావటంతో పీఎం పాలెం పోలీసులకు నండూరి రమేష్‌ ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి డ్రమ్ము తెరిచిచూడగా అందులో పుర్రె, అస్థి పంజరం, జుట్టు కనిపించాయి.

దీంతో పాటు ఘటనా స్థలంలో మృతురాలు ధనలక్ష్మికి చెందిన బ్యాగ్‌ లభించగా.. అందులో రిషి ఫోన్‌ నంబర్‌ రాసి ఉన్న ఓ స్లిప్‌ దొరికింది. కాల్‌ లిస్ట్‌ ఆధారంగా ఘటన జరగడానికి ముందు మృతురాలి నంబర్‌ నుంచి అతడి నంబర్‌కు ఫోన్లు రావడాన్ని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి మృతురాలి వివరాలతోపాటు నిందితుడిని గుర్తించారు.

ధనలక్ష్మికి తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు ఎవరూ లేకపోవటంతో ఆమె కనిపించడం లేదని ఎక్కడా మిస్సింగ్‌ కేసు కూడా నమోదు కాలేదు. నిందితుడి ఫోన్‌ నంబర్‌ను ట్రేస్‌ చేయగా.. అతడు 6 నెలలుగా కొమ్మాదిలోని ఒక హాస్టల్‌లో అసిస్టెంట్‌ కుక్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కేసు ఛేదించినట్లు కమిషనర్‌ శ్రీకాంత్‌ తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Rupee Falls To All-Time Low: డాలర్ ముందు విలవిలలాడుతున్న రూపాయి, మళ్లీ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన భారత కరెన్సీ, దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బ తప్పదంటున్న విశ్లేషకులు

Kanuma 2025 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు కనుమ పండగ సందర్భంగా Whatsapp Status, Quotes, Instagram Messages కోసం ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి..

Allahabad High Court: శృంగారంలో అనుభవమున్న మహిళ లైంగిక దాడిని ప్రతిఘటించకపోతే అత్యాచారంగా పరిగణించలేం, కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు

Hyderabad Horror: నార్సింగిలో జంట హత్యల కేసు, అత్యంత దారుణంగా రేప్ చేసి బండరాయితో చంపేశారని అనుమానాలు, ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఇద్దరి మృతదేహాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Share Now