WhatsApp scam: మీరు కూడా ఆ లింక్ మీద క్లిక్ చేస్తున్నారా, అయితే మీ పని గోవిందా, ఏపీలో వాట్సప్ లింక్ క్లిక్ చేసినందుకు రూ. 21 లక్షలు పోగొట్టుకున్న టీచర్
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం రెడ్డప్ప నాయుడు కాలనీకి చెందిన వరలక్ష్మి తనకు జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.
Amaravati, August 24: ఏపీలో ఓ టీచర్ వాట్సాప్ స్కాం భారీన పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం రెడ్డప్ప నాయుడు కాలనీకి చెందిన వరలక్ష్మి తనకు జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.
ఆమెకు గుర్తు తెలియని నంబర్ నుంచి లింక్ ఒకటి వాట్సాప్ సందేశంగా (clicking on a link received on WhatsApp) వచ్చింది. దానిపై క్లిక్ చేయగా, బ్యాంకు ఖాతా నుంచి రూ.21 లక్షలను (Andhra woman loses Rs 21 lakh) సైబర్ నేరస్థులు ఊడ్చేశారు. గుర్తుతెలియని కాంటాక్ట్ నుంచి వచ్చిన వాట్సాప్ లింక్‌ను ఆమె క్లిక్ చేసిన వెంటనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది.ఒక్కసారిగా ఆమె ఖాతా నుంచి రూ 21 లక్షలు డెబిట్ అయ్యాయి.
లింక్ పై క్లిక్ చేసిన తర్వాత ఆమె బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి, ఖాతాలో ఉన్న బ్యాలన్స్ అంతటినీ ఒకే లావాదేవీగా ట్రాన్స్ ఫర్ చేసేశారు. దీంతో ఆమె బ్యాంకును ఆశ్రయించగా, ఖాతాలో మోసం చోటు చేసుకుందని, ఖాతా నుంచి రూ.21 లక్షలు దొంగిలించినట్టు వారు చెప్పారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
లింక్ లను క్లిక్ చేసిన వెంటనే, బాధితుల ఫోన్ నంబర్ ఆధారంగా వారి బ్యాంకు ఖాతా, ఇతర వివరాలను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వెబ్ లింక్ ను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.వాట్సాప్ లింక్స్ ద్వారా సైబర్ నేరాలు ఇటీవల పెరిగాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
లింక్‌లపై యూజర్లు క్లిక్ చేసిన వెంటనే స్కామర్లు బాధితుల ఫోన్, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేసి లూటీలకు పాల్పడుతున్నారని చెప్పారు. గుర్తుతెలియని నెంబర్, వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని, యూఆర్ఎల్‌ను సరిగ్గా చెక్ చేసుకుని అది సరైన లింక్ అని నిర్ధారణకు రావాలని సూచిస్తున్నారు. నగదు ప్రయోజనాలు కల్పించేలా ఉండే లింక్‌లు, మెసేజ్‌లను క్లిక్ చేయరాదని, వాటిని షేర్ చేయరాదని పోలీసులు కోరుతున్నారు. అలాంటి మెసేజ్‌లను స్కామర్లే ఎక్కువగా పంపిస్తుంటారని చెప్పారు.