Andhra Pradesh: కోడలిపై మామ లైంగిక దాడి, న్యాయం కోసం వెళితే అక్కడ మరొకరు అత్యాచార యత్నం, అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేసిన గుంటూరు యువతి

భార్యాభర్తల గొడవలో తలదూర్చిన మధ్యవర్తులు తనను బెదిరిస్తున్నారని (Harassment) గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు.

Representational Image (Photo Credits: File Image)

Amaravati, August 10: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల గొడవలో తలదూర్చిన మధ్యవర్తులు తనను బెదిరిస్తున్నారని (Harassment) గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం.. ఈనెల 2వ తేదీన స్వాతి అర్బన్‌ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చి భర్త సందీప్‌ వేధిస్తున్నాడని, మామ శ్రీనివాసరావు లైంగిక దాడికి యత్నించాడని, తన పాపను చంపేందుకు యత్నించారని ఫిర్యాదు (Woman Complaint Of Husband Family) చేశారు.

ఆ సమయంలో మహిళా మండలి నేతగా పరిచయం చేసుకున్న శైలజ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని నమ్మించింది. 3వ తేదీన గీతా రీజెన్సీకి పిలిచి ఖర్చుల కింద రూ.25 వేలు ఇవ్వాలని అడిగింది. స్వాతి వ్యతిరేకించడంతో శైలజ, ఆమె అనుచరులు ఈమని చంద్రశేఖరరావు, కొర్రపాటి సురేశ్‌, నాగుల్‌మీరా స్వాతి భర్తకు మద్దతుగా నిలిచారు. స్వాతిపై ప్రెస్‌మీట్లు పెట్టించి యూట్యూబ్‌లో ప్రచారం చేశారు. ఆమె భర్త చేత లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు.

మామతో పడుకోమన్న శాడిస్ట్ భర్త, నీవు రాకుంటే నీ రెండేళ్ల కూతురుతో పడుకుంటానన్న కీచక మామ, ఆ దుర్మార్గుల నుంచి రక్షణ కల్పించాలని స్పందన కార్యక్రమంలో అర్బన్‌ ఎస్పీని వేడుకున్న బాధిత మహిళ

తమకు పోలీసు ఉన్నతాధికారులు బాగా సన్నిహితమని, తాము కోరినట్లు నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫోన్‌లోనే పలుమార్లు బెదిరించారు. దళిత నాయకులైన ఈమని చంద్రశేఖరరావు, కొర్రపాటి సురేష్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని స్వాతి అర్బన్‌ ఎస్పీని కోరింది.