Sexually Assault | Representational Image (Photo Credits: File Image)

Amaravati, August 3: గుంటూరు జిల్లాలో తిరుగుబోతు భర్త.. కీచక మామల నుంచి నాకు నా కుమార్తెకు రక్షణ కల్పించాలని ఓ మహిళ పోలీసులను (Woman Complaint her Uncle Sexual Harassment) వేడుకుంది. గుంటూరు అర్బన్‌ ఎస్పీ స్పందన కార్యక్రమం (Guntur Urban SP in spandana Program) నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధిత మహిళ ప్రకారం.. జిల్లాలోని డొంకరోడ్డుకు చెందిన ఎలినేని సందీప్‌ తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అనంతరం 2016 సంవత్సరంలో శ్రీనగర్‌కు చెందిన స్వాతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఇతనికి చెడు తిరుగుళ్లు చాలానే ఉన్నాయి. టిక్‌టాక్‌ ద్వారా పరిచయం అయిన అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఏ పని చేయకుండా జల్సాగా తిరిగేవాడు.

స్నేహితురాలు అంటూ ఓ మహిళను తరచూ తన రెండో భార్య ముందే ఇంటికి తీసుకువచ్చేవాడు. అతను చేసిన ఈ పనులకు అతని తల్లి పద్మావతి కూడా అతనికే వత్తాసు పలికింది. అయితే 2017 సంవత్సరంలో పద్మావతి అనారోగ్యంతో మృతి చెందింది. ఇక కంభంపాడులో నివసించే సందీప్‌ తండ్రి శ్రీనివాసరావు తరచూ కొడుకు ఇంటికి వచ్చి కోడలు స్వాతితో అసభ్యంగా ప్రవర్తించే వాడు. భర్తకు చెబితే మందలించకపోగా తన తండ్రినే వెనుకేసుకుని వచ్చేవాడు.

అమ్మాయిలు, ఆంటీలే టార్గెట్, ఫేస్‌బుక్ ద్వారా అర్థ నగ్నఫోటోలతో బ్లాక్ మెయిల్, ఆ తర్వాత వారిని అనుభవించి డబ్బు, నగలతో పరార్, నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన కడప పోలీసులు

ఈ పరిస్థితుల మధ్య పద్మావతి ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగం చేస్తూ చనిపోవడం వల్ల ఆ ఉద్యోగం కుమారుడికి రావాలంటే తండ్రి శ్రీనివాసరావు ఎన్‌ఓసిపై సంతకం చేయాలి. అయితే అతని తండ్రి నీ భార్యను నాతో పడుకోమని చెప్పడంతో నా భర్త తన తండ్రికి సహకరించమంటూ ప్రోత్సహించాడు. ఇది ఒప్పుకోలేదని మామ బాత్‌రూమ్‌లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడని వాపోయింది. కుమారుడిని ఇతర మహిళలతో తిరగకుండా బుద్ది చెప్పాలని, నాకు న్యాయం చేయాలని నా మామను కోరితే నాతో ఉండు నీకు న్యాయం చేస్తానంటూ దుర్మార్గంగా ప్రవర్తించాడని ఎస్పీతో మొరపెట్టుకుంది.

పోర్న్ వీడియోలు చేస్తున్న మరో నటి, నాన్సీ భాబీ పేరిట వెబ్‌ సిరీస్‌ చేస్తున్న బెంగాల్ నటి నందితా దత్తాను అరెస్ట్ చేసిన పోలీసులు

దీనికి ఒప్పుకోలేదని స్వాతికి, ఆమె కుమార్తెకు వారు సరిగా తిండి పెట్టలేదు. ఓ సారి మామ లైంగిక దాడికి యత్నించగా ఆమె ఎదురుతిరిగి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తింది. నువ్వు లొంగక పోతే నీ రెండున్నరేళ్ల కుమార్తెతో కోరిక తీర్చుకుంటానని పాపను లాక్కుని బెదిరించాడని తెలిపింది. రోజూ శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడని వాపోయింది. ఈ వేధింపులు తట్టుకోలేక 2018 డిసెంబర్‌లో బంధువుల సహాయంతో శ్రీనగర్‌లోని పుట్టింటికి చేరింది. ఫిర్యాదు చేసేందుకు వెళుతుంటే చంపుతామని బెదిరిస్తున్నారని రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరపి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించినట్లుగా తెలుస్తోంది.