Andhra Pradesh: ఇదేం విచిత్రం, పెళ్లి కోసం హిజ్రాగా మారిన యువతి, తర్వాత పెళ్లికి నిరాకరించిన మరో యువతి, మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కడప పోలీసులు
అయితే ఆ తర్వాత సదరు మహిళ పెళ్లికి (woman refused to marry young woman) నిరాకరించడంతో ఆమె మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను (YSR Kadapa Police) ఆశ్రయించింది
YSR Kadapa, July 24: కడపలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పోలీసుల దాకా చేరడంతో ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ విచిత్ర ఘటన వివరాల్లోకెళితే.. హిజ్రాగా మారితే పెళ్లాడతానన్న మహిళ మాటలు నమ్మిన మరో యువతి హిజ్రాగా (hijra) మారింది. అయితే ఆ తర్వాత సదరు మహిళ పెళ్లికి (woman refused to marry young woman) నిరాకరించడంతో ఆమె మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను (YSR Kadapa Police) ఆశ్రయించింది
పోలీసుల కథనం ప్రకారం.. కడపకు చెందిన ఓ యువతి తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకాల్లో భాగంగా ఆ యువతికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. శిక్షణ సమయంలో ఓ మహిళ యువతికి పరిచయమైంది. అది ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. మంచి స్నేహితులుగా మారారు. సదరు యువతికి అబ్బాయి లక్షణాలున్నాయి. హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని.. పరిచయమైన మహిళ యువతిని బలవంతపెట్టింది.
ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. తాజాగా యువతిని పెళ్లాడేందుకు ఆ మహిళ నిరాకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారి ప్రేమను మహిళ తల్లిదండ్రులకు చెప్పిడంతో వారు అంగీకరించలేదు. అంతే కాకుండా మహిళను నిర్బంధించారు. హిజ్రాగా మారమని చెప్పి ఇప్పుడు మోసం చేసిందని, న్యాయం చేయాలని యువతి కడప జిల్లా పోలీసులను ఆశ్రయించింది. మహిళపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ఎలా పరిష్కరించాలని పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.