Y. S. Sharmila: ఏపీలో షర్మిల పార్టీపై సస్పెన్స్, వ్యూహాత్మక సమాధానం ఇచ్చిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని తెలిపిన షర్మిల

S. Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై (political party Establishment in Andhra Pradesh) మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు.

YS Sharmila (Pic Credit: IANS/ Twitter )

Hyd, Jan 3: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (Y. S. Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై (political party Establishment in Andhra Pradesh) మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టవచ్చు... పెట్టకూడదనే రూల్ ఏమీ లేదుకదా? అని వ్యాఖ్యనించారు. కొంత కాలంగా సోదరుడు జగన్ తీరుపై షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. మొన్న పులివెందుల వెళ్లినప్పుడు కూడా జగన్, షర్మిల మధ్య వాగ్వాదం జరిగిందనే వార్త గుప్పుమంది. అయితే న్యూ ఇయర్ రోజున షర్మిల జగన్ ఇంటికి వెళ్లడంతో ఈ వార్తలు తుస్సుమన్నాయి.

తాజాగా ఏపీలో పార్టీ పెడతారా అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల వ్యూహాత్మకంగా సమాధానం (YS sharmila Interesting comments ) ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. తామొక మార్గాన్ని ఎంచుకున్నామని, ఈనెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రైతు ఆవేదన యాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారని, కరోనా నిబంధనలు పాటిస్తామంటున్నా అనుమతి ఇవ్వడం లేదన్నారు.

కీలక అంశాలే ఎజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ప్రధాని మోదీతో సాయంత్రం 4 గంటలకు భేటీ, రేపు హోం మంత్రితో భేటీ అయ్యే అవకాశం

ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం నిబంధనలు అడ్డురావా? అన్ని ప్రశ్నించారు. నిబంధనల వంకతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని షర్మిల మండిపడ్డారు.



సంబంధిత వార్తలు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

Telangana Govt. Declares Holiday: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు