Mekathoti Sucharitha: నేనేదో సరదాగా అన్నానంతే.. పార్టీ మార్పు వైరల్ వీడియోపై మేకతోటి సుచరిత స్పందన ఇది

రాజకీయాలలో ఉంటే వైసీపీతోనే ఉంటానని, లేదంటే ఇంట్లో ఉంటానని స్పష్టం చేశారు.

Credits: Twitter/YCP

Vijayawada, Jan 7: తానేదో సరదాగా చేసిన వ్యాఖ్యలను వైరల్ (Viral) చేశారని ఏపీ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత (Mekathoti Sucharitha) అన్నారు. గుంటూరు (Guntur) జిల్లా కాకుమానులో రెండు రోజుల క్రితం కార్యకర్తలతో సుచరిత మాట్లాడుతూ.. తాను ఓ భార్యగా భర్త అడుగుజాడల్లోనే నడవాల్సి ఉంటుందని, ఆయన పార్టీ మారి, తనను కూడా రమ్మంటే భార్యగా ఆయన వెంట వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. వైసీపీలో (YCP) మనగలిగినన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో (Social Media) విపరీతంగా వైరల్ అయింది.

శ్రీవారి ప్రత్యేక దర్శన కోటా టికెట్లపై టీటీడీ ప్రకటన.. ఈ నెల 9న టికెట్ల కోటా విడుదల

ఆమె పార్టీ మారబోతున్నారని పలువురు అనుకున్నారు. ఆమె వ్యాఖ్యలు ప్రధాన మీడియాలోనూ ప్రముఖంగా రావడంతో సుచరిత స్పందించారు. కాకుమాను కార్యకర్తలతో తాను సరదాగా చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని అన్నారు. రాజకీయాలలో ఉంటే వైసీపీతోనే ఉంటానని, లేదంటే ఇంట్లో ఉంటానని స్పష్టం చేశారు.