Credits: Twitter/TTD

Tirumala, Jan 7: శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల (Tirumala) క్షేత్రంలో ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshanam) టికెట్లు (Tickets) జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో రూ.300 టికెట్లను, ఇతర ప్రత్యేక ప్రవేశ కేటగిరీల టికెట్లను జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో, జనవరి, ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లపై (ఎస్ఈడీ-SED) టీటీడీ (TTD) ప్రకటన చేసింది.

గే సెక్స్ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, ఫిబ్రవరి 15 లోగా స్పందన తెలపాలని కేంద్రానికి సూచన, అన్ని పిటిషన్లను మార్చి నుంచి విచారిస్తామని తెలిపిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్

ఈ నెల 12 నుంచి 31 వరకు దర్శనాలకు సంబంధించిన టికెట్లతో పాటు, ఫిబ్రవరి నెలకు సంబంధించి టికెట్ల కోటాను కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు. రెండు నెలలకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లను ఈ నెల 9 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.

స్వలింగ సంపర్కానికి ఓకే, కానీ స్వలింగ వివాహాలకు విరుద్ధం, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ

అంతేకాకుండా, వృద్ధులు, దివ్యాంగుల కోటా శ్రీవారి దర్శన టికెట్లను కూడా టీటీడీ విడుదల చేస్తోంది. ఈ టికెట్లు ఈ నెల 7న ఉదయం 9 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్నాయి.

స్వలింగ వివాహాలను న్యాయవ్యవస్థ గుర్తించదు, ఇలాంటి వివాహాలను అనుమతించలేమని ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, తదుపరి విచారణ అక్టోబర్‌ 21కి వాయిదా