YS Jagan Cabinet 2.0: ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం, తొలుత మంత్రిగా ప్రమాణం చేసిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఏపీ నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అప్ డేట్స్ ఇవే..

తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రిగా అంజాద్‌ బాషా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నూతన మంత్రిగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు.

AP CM YS Jagan Mohan Reddy (photo-Twitter)

Amaravati, April 11: మంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రిగా అంజాద్‌ బాషా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నూతన మంత్రిగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. 2009 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.

డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019లో డోన్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వహించారు.మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు బలమైన బీసీ నాయకుడిగా పేరుంది. మాడుగుల నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రామచంద్రాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత సీఎం జగన్‌ కేబినెట్‌లో బీసీ వెల్ఫేర్‌ మంత్రిగా ఉన్నారు. 2001 నుంచి 2006 వరకు రాజోలు జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు.

తుని నియోజకవర్గం ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగశ్వేరరావు (దాడిశెట్టి రాజా)  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా సేవలు అందించారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 14 మంది కొత్త ముఖాలకు వైఎస్ జగన్ మంత్రి వర్గంలో చోటు, 11 మంది సీనియర్లకు మరోసారి అవకాశం, మొత్తం 25 మందితో మంత్రి వర్గం ఏర్పాటు

శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1980లో రాజకీయ ప్రవేశం చేశారు. వైఎస్సార్‌ కేబినెట్‌ రెవెన్యూ మంత్రిగా చేశారు. 2010-13 వరకు ఆర్‌ అండ్‌ బి మంత్రిగా పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యే, 3సార్లు మంత్రిగా పనిచేశారు.

అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014-2019 మధ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన 2014, 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.2019 నుంచి కార్మికశాఖ మంత్రిగా మంత్రిగా ఉన్నారు. 2006 జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు.

ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకునేవాళ్ల జాబితా ఇదే, ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ఫైనల్ చేసిన సీఎం జగన్

పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన కృష్ణా జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2015 నుంచి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 2016లో తణుకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో తణుకు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నారాయణస్వామి ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత కేబినెట్‌లో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లో గంగాధరనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్‌ ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో రాజకీయ అరంగేట్రం చేశారు. 2019లో వేమూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ నూతన కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గనులు శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.

అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్‌ ఏపీ నూతన కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు. 1989లో రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఉమ్మడి ఏపీలో పశుసంవర్ధకశాఖ మంత్రిగా పనిచేశారు. సీఎం జగన్‌ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.

సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర ఏపీ నూతన కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణం చేశారు. 2009 నుంచి మూడుసార్లు​ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లో సాలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012-13 మధ్య ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.

నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ నూతన కేబినెట్‌లో నూతన మంత్రిగా ప్రమాణం చేశారు. 2014, 2019లో నగరి నుంచి గెలుపొందింది. 2020 నుంచి ఏపిఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు.

పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఏపీ నూతన కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు. 2007 నుంచి పలాస ప్రాంతంలో వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. 2019లో పలాస నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తానేటి వనిత ఏపీ నూతన కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు. 2009లో మొదటిసారి గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

 



సంబంధిత వార్తలు