AP Chief Minister YS Jagan | File Photo

అమరావతి, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం జాబితా ఖరారయింది. మరికాసేపట్లో రాజ్ భవన్ కు కొత్త మంత్రుల జాబితా వెళ్లనుంది. పది మంది పాత మంత్రులకు తిరిగి జగన్ కొత్త కేబినెట్ లో అవకాశం కల్పించారు. పదిహేను మందికి కొత్త వారికి ఈ కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు.

ఫైనల్ జాబితాగా చెబుతున్న ఈ మంత్రివర్గంలో సభ్యులకు కొందరికి ఇప్పటికే ఫోన్లు చేసి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి రావాలసి సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లినట్లు తెలిసింది. అయితే కొందరు సీనియర్లు కేబినెట్ ర్యాంకు ఉన్న పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.

ప్రభుత్వ చీఫ్ విప్ గా నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి, ప్రణాళిక సంఘం వైెస్ ఛైర్మన్ గా మల్లాది విష్ణులను నియమించాలని నిర్ణయింఃచారు.

Imran Khan: సుప్రీంకోర్టు తీర్పు బాధించింది! కానీ గౌరవిస్తా, భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ కీలక కామెంట్లు, భారత్ విదేశాంగ విధానం సూపరంటూ ప్రశంసలు, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు ఖాన్ కీలక ప్రసంగం

శ్రీకాకుళం జిల్లా :

ధర్మాన ప్రసాదరావు (వెలమ, బీసీ)

సీదిరి అప్పలరాజు (మత్స్యకార, బీసీ -పాత మంత్రి)

విజయనగరం జిల్లా :

బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు, (బీసీ) పాత మంత్రి)

పిడిక రాజన్న దొర (ఎస్టీ)

విశాఖపట్నం జిల్లా :

గుడివాడ అమర్‌నాధ్ (కాపు)

బూడి ముత్యాల నాయుడు (కొప్పల వెలమ (బీసీ)

తూర్పు గోదావరి జిల్లా :

దాడిశెట్టి రాజా (కాపు)

చెల్లుబోయిన వేణుగోపాల్ (బీసీ, శెట్టిబలిజ)

విశ్వరూప్ (ఎస్సీ పాతమంత్రి)

పశ్చిమ గోదావరి జిల్లా :

తానేటి వనిత (ఎస్సీ)

కారుమూరి నాగేశ్వరరావు (బీసీ)

కొట్టు సత్యనారాయణ (కాపు)

కృష్ణా జిల్లా :

జోగి రమేష్ (గౌడ, బీసీ)

గుంటూరు జిల్లా :

అంబటి రాంబాబు ( కాపు)

మేరుగు నాగార్జున (ఎస్సీ)

విడదల రజని (రజక, బీసీ)

నెల్లూరు జిల్లా :

కాకాని గోవర్థన్ రెడ్డి (రెడ్డి)

చిత్తూరు జిల్లా :

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రెడ్డి పాత మంత్రి)

నారాయణస్వామి (ఎస్సీ, పాత మంత్రి )

ఆర్కే రోజా (రెడ్డి)

కడప జిల్లా :

అంజాద్ భాషా (పాతమంత్రి)

కర్నూలు జిల్లా :

బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి (రెడ్డి , పాతమంత్రి)

గుమ్మనూరి జయరాం (బీసీ, బోయ, పాత మంత్రి)

అనంతపురం జిల్లా

ఉషశ్రీ చరణ్ (కురు (బీసీ)

తిప్పేస్వామి ( ఎస్సీ)