IPL Auction 2025 Live

EVM Destroy in Andhra Pradesh: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసంపై ఈసీ సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు, వైరల్ వీడియోపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు దెబ్బతిన్నాయని, అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మే 21 (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది.

ysrcp mla pinnelli ramakrishna reddy throws EVM machine on ground to damage it & walks out nonchalantly TDP demanded stringent EC action Watch Video

Macherla, May 22: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు దెబ్బతిన్నాయని, అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మే 21 (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. వైఎస్సార్‌సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోలింగ్ స్టేషన్ 202లోని ఈవీఎంలను డ్యామేజ్ చేసినట్లు వెబ్ కెమెరా రికార్డింగ్‌లో కనిపించడంతో ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చారు.ఈ వీడియో మంగళవారం సాయంత్రం వైరల్‌గా మారింది.

పల్నాడు జిల్లాలోని ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల నుండి సేకరించిన వీడియో ఫుటేజీని విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని ఏపీ ఎన్నికల అధికారి మీనాను ఈసీ ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. సాయంత్రంలోపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.  పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, వీడియోను విడుదల చేసిన టీడీపీ

ఇదిలా ఉంటే ఈ ఘటనలపై వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు.మంగళవారం హైద­రా­బాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు తాను సిద్ధ­మని పిన్నెల్లి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మా­రెడ్డి మాచర్ల నియో­జ­­క­­వ­­ర్గ­ంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఆజ్యం పోసి.. ఆయన మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ప్రజ­లను పట్టించుకోవడం లేదు. అటువంటి వ్యక్తి నేను పారిపోయానని చెప్ప­టం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితమని మండిపడ్డారు.  వీడియోలు ఇవిగో, రణరంగంలా మారిన పల్నాడు, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అంబటి రాంబాబు మండిపాటు, ఈసీకీ ఫిర్యాదు

ఏడు మర్డర్‌ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపో­యాడు. ఆ తర్వాత నియోజక­వర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబా­బు తీసు­కొచ్చి పల్నా­డు­లో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోశారు. కారెంపూడి మండ­లంలోని చింతపల్లి, ఒప్పిచర్ల, రెంట­చింతల మండలంలో తుమృకోట, పాలవా­యి­గేటు గ్రామాల్లో కమ్మ సామాజికవర్గానికి చెంది­నవారు మా ఏజెంట్లను తరిమికొట్టి గొడవలు సృష్టి­ంచారు.

కారెంపూడి సీఐ నారాయణస్వామి ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో గొడవలు జరుగుతా­యని బందోబస్తు పెంచాలని హైకోర్టు నుంచి ముందుగానే ఆర్డర్‌ తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చినా పట్టించు­కోలేదు. ఎన్నికల రోజు గొడవలు జరిగినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీ­సుల సూచనల మేరకు హైదరాబాద్‌కు వచ్చాను. మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర నాకు లేదు. నేను ఎన్నడూ పారి­పోలేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామా­జికవర్గాన్ని ఒకటి చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు కలిసి గొడవలు చేశారు.

టీడీపీని గెలిపించేందుకు సీఐ నారాయణస్వామి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర నాది కాదు. నేను ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చందాలు వసూలు చేసి ఇల్లు కట్టుకుని చందాల నాయకుడుగా మారిన బ్రహ్మారెడ్డి నన్ను విమర్శించడం సిగ్గుచేటు.’ అని పిన్నెల్లి రామకృష్ణరెడ్డి చెప్పారు.