YSRCP MLA Ambati Rambabu: టీడీపీ అంతమయ్యే దినోత్సవం, బాబు మళ్లీ అధికారంలోకి రావడం కల మాత్రమే, పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలిచి సీఎం అవుతాడు, తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాదు.. అంతర్ధాన దినోత్సవంలా కనిపించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు (YSRCP MLA Ambati Rambabu) అన్నారు.

YSRCP MLA Ambati Rambabu (Photo-Facebook)

Amaravati, Mar 30: టీడీపీ పార్టీపై, దాని అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాదు.. అంతర్ధాన దినోత్సవంలా కనిపించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు (YSRCP MLA Ambati Rambabu) అన్నారు. సూర్యోదయాన చేసుకోవాల్సిన ఆవిర్భావ దినోత్సవాన్ని.. సూర్యాస్తమ సమయంలో జరుపుకున్నారని, టీడీపీకి పుట్టగతులు లేవని నిన్న జరిగిన సంఘటన చూస్తే అర్థం అవుతుందన్నారు.

టీడీపీలో చంద్రబాబు నాయుడు ఒక విషసర్పంలా చేరారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు దుయ్యబట్టారు. దివంగత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజు చంద్రబాబు (Chandrababu) కాంగ్రెస్‌లో ఉన్నారని, కాంగ్రెస్‌లో ఓడిపోయిన తర్వాతే చంద్రబాబు టీడీపీలో చేరారని విమర్శించారు. ఈ మేరకు తాడేపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ వారసులకు పౌరుషం ఉంటే టీడీపీకి ఈ గతి పట్టేది కాదని అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ శిథిలావస్థకు చేరుకుందని విమర్శించారు

రాష్ట్ర సంక్షేమం కోసమే వైఎస్ఆర్‌సీపీకి ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు హయంలో 132 శాతానికి పైగా అప్పులు చేశారు. చంద్రబాబు.. తన కార్యకర్తలకు డబ్బులు దోచిపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన చూశారు కాబట్టే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్ఆర్‌ సీపీకి విజయం అందించారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్‌సీపీ వెనక్కి తగ్గదు. కేంద్రంపై నిరంతరం వైఎస్ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు.

 సీఐ అయితే మాస్క్ ధరించవా, హడావిడిలో మర్చిపోయాను సార్, తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావుకు మాస్క్ లేని కారణంగా జరిమానా విధించిన ఎస్పీ అమ్మిరెడ్డి, స్వయంగా మాస్క్ తొడిగిన గుంటూరు అర్బన్‌ ఎస్పీ

మళ్లీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చేది ఒక కల మాత్రమే. చంద్రబాబు మళ్లీ వస్తాడని ఎదురు చూసి కార్యకర్తలు మోసపోవద్దు. అమరావతి, పోలవరాన్ని ఆదాయ మార్గాలుగా చంద్రబాబు మార్చుకున్నారు. రాజధానిలో లక్షల కోట్లను టీడీపీ నేతలకు చంద్రబాబు దోచిపెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గుణం చంద్రబాబుదే. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ పార్టీ కార్యాలయాల్లో ఇక హెరిటేజ్ మాల్స్ పెట్టుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తొమ్మిది నెలల్లోనే రాజకీయశక్తిగా ఎదిగి తిరుగులేని పాలన చేసిందని అంబటి అన్నారు. చీమలు పెట్టిన పుట్టలోకి పాములు ప్రవేశించినట్టుగా చంద్రబాబు ఆ పుట్టలోకి ప్రవేశించి, పార్టీని ఆక్రమించుకున్నారని చెప్పారు. టీడీపీ బతికి బట్టకట్టడం సాధ్యం కాదని..ఎన్టీఆర్ కుమారులకు పౌరుషం ఉంటే... పార్టీని చంద్రబాబు నాశనం చేయకుండా కాపాడేవారని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం 11 నెలల్లో రూ. 79,191 కోట్ల అప్పులు చేసిందని పత్రికలో వార్త రాగానే చంద్రబాబు దాన్ని భుజాన పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఉద్దేశంతో కరోనా సమయంలో కూడా జగన్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. దీన్నంతా ప్రజలు గమనించారు కాబట్టే... పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి పట్టంకట్టారని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు కూడా చంద్రబాబుకు లేదని అన్నారు.

బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి..పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలిచాడు.. అని ఆయన సీఎం అవుతాడు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు అనే ప్రచారం అంటే చంద్రబాబుకి చేతకాదని అర్థం అని అన్నారు. చంద్రబాబు చేతిలో ఆ పార్టీ అంతం కావడం ఖాయం..తమ్ముళ్లు వేరే దారి చూసుకోవడం మంచిదని హితవు పలికారు.



సంబంధిత వార్తలు

Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif