Polavaram Project Funds: పోలవరం నిధులు త్వరలో విడుదల చేస్తామని తెలిపిన ఆర్థిక మంత్రి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై రాజ్యసభలో ప్రస్తావించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

3,805 కోట్ల బకాయిలను (Polavaram Project Funds) త్వరగా విడుదల చేయాలని రాజ్యసభలో వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థికమంత్రిని కోరారు. ఈ సంధర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ త్వరలోనే విడుదల చేస్తామని (Polavaram Grants Release) హామీ ఇచ్చినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ (YSRCP MP Vijaya Sai Reddy) పేర్కొన్నారు. రాజ్యసభ సమావేశాల సందర్భంగా మంగళవారం విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై రాజ్యసభలో ప్రస్తావించారు.

YSRCP MP Vijaya Sai Reddy (Photo | @VSReddy_MP/Twitter)

Amaravati, Sep 15: ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,805 కోట్ల బకాయిలను (Polavaram Project Funds) త్వరగా విడుదల చేయాలని రాజ్యసభలో వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థికమంత్రిని కోరారు. ఈ సంధర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ త్వరలోనే విడుదల చేస్తామని (Polavaram Grants Release) హామీ ఇచ్చినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ (YSRCP MP Vijaya Sai Reddy) పేర్కొన్నారు. రాజ్యసభ సమావేశాల సందర్భంగా మంగళవారం విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై రాజ్యసభలో ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ (Polavaram Reservoir Project) ఆంధ్రప్రదేశ్ జీవనాడి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ముందుకువెళుతోందని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల కోసం చూడకుండా ప్రభుత్వమే సొంతంగా ఖర్చు చేస్తోందన్నారు.

కేంద్రం నుంచి రూ. 3,805 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, దీనికి సంబంధించి కాగ్ ఆడిట్ కూడా పూర్తయిందన్నారు. పోలవరంకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలని సీఎం జగన్‌ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే 2021 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. వెంటనే పోలవరంకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక హోదానే ఎజెండా కావాలి, పెండింగ్ నిధులు ఇవ్వాలని నిలదీయండి, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు ఏపీ సీఎం వైయస్ జగన్ దిశా నిర్దేశం

ఈ అంశంపై నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. రాష్ట్ర ఆర్ధిక మంత్రితో బకాయిల చెల్లింపులపై చర్చలు జరుపుతున్నామన్నారు. కాగ్ సర్టిఫికేషన్ వల్ల నిధుల విడుదల ఆలస్యమైందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం బకాయిలను విడుదలయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు