IPL Auction 2025 Live

MLA Roja: సర్జరీల తర్వాత తొలిసారి బయటకు వచ్చిన ఎమ్మెల్యే రోజా, ప్రచారంలో పాల్గొనలేకపోతున్నానంటూ వీడియో సందేశం, నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్

విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన రోజా ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కోలుకుంటున్నారు.

MLA Roja (Photo-Twitter)

Nagari, April 6: ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు (ysrcp-Nagari mla-roja) రెండు శస్త్ర చికిత్సలు జరిగిన విషయం విదితమే. విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన రోజా ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కోలుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తొలిసారిగా ఆమె మీడియాకు దర్శనమిచ్చారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో (AP mptc-zptc-polls 2021) మరోసారి వైసీపీకి ఘన విజయం కట్టబెట్టాలంటూ ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక రోజా తొలిసారి బయటికి కనిపించడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రోజా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు. దీంతో ఇంటి నుంచే నేతల్ని సమన్వయం చేసుకుంటూ విజయానికి బాటలు వేస్తున్న రోజా ఇవాళ తొలిసారి వీడియోలో దర్శనమిచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ తర్వాత తాను ఎలా ఉన్నానని ఆందోళన చెందుతున్న అభిమానులకు ఊరటనిచ్చేలా రోజా ఇందులో కనిపించారు.

Here's Video 

గతంలోలా ఉత్సాహంగా మాట్లాడుతూ రోజా ఇచ్చిన సందేశం ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నా, మేజర్ ఆపరేషన్‌ జరగడం వల్ల మిమ్మల్ని కలవలేకపోయాను, నా కోసం ప్రార్ధించిన వారికి, నా ఆరోగ్యం కోసం ధైర్యం చెప్పిన జగనన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు రోజా తెలిపారు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినందున తాను ఇంటికే పరిమితమైనట్లు వీడియోలో రోజా వెల్లడించారు. రెండేళ్లలో జగన్‌ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నిలబెట్టుకున్నారని రోజా ఓటర్లకు గుర్తుచేశారు. కాబట్టి మరోసారి వైసీపీని గెలిపించి అండగా నిలవాలని కోరారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే రోజా, మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలిపిన డాక్టర్లు, రోజాను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రోజా వీడియో సందేశం

నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఫోన్ చేసి మరీ నా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న శ్రీ జగనన్న గారికి, పార్టీ ముఖ్య నేతలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రానున్న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నాను కావున మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి జగనన్నకు కానుకగా ఇవ్వవలసినదిగా కోరుకుంటున్నాను.