YSRCP Protest in Delhi: రేపు మేము అధికారంలోకి వస్తాం, ఢిల్లీ వేదికగా జగన్ మాస్ వార్నింగ్, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జాతీయ పార్టీలకు వైసీపీ అధినేత విజ్ఞప్తి
ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు వారు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వస్తాం.
New Delhi, July 24: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు వారు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వస్తాం. నిన్న మేము అధికారంలో ఉన్నాం కానీ ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ ప్రచారం చేయలేదని, దాడులు, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని మేం ఎప్పుడూ ప్రోత్సహించలేదని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడాలని కోరారు. తాము ప్రదర్శించిన ఫొటోలు, వీడియోలు చూడాలని జాతీయ మీడియాను, నాయకులను కోరారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మండిపడిన జగన్
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడుల భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి కథను పక్క దారి పట్టించేందుకే ఈ ధర్నా, వైసీపీ నిరసనపై మండిపడిన టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, వీడియో ఇదిగో..
వందల ఇళ్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా అక్రమ కేసులో పెట్టారు. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారు. మా హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులు, దౌర్జన్యాల్ని ప్రొత్సహించలేదు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. లోకేష్ రెడ్‌బుక్ పేరుతో హోర్డింగ్‌లు పెట్టారు. ఇది ఎలాంటి సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు. దాడులు మంచివి కావు, రేపు మళ్ళీ జగన్ సీఎం కావచ్చు, వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్, వీడియో ఇదిగో..
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. దాడులు చేస్తున్న, చంపుతున్న, ఆస్తులు ధ్వంసం చేస్తున్న వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి. మీడియా.. ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి అని జగన్ విజ్ఞప్తి చేశారు.