వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్మాకు సమాజ్‌వాదీ పార్టీ సంఘీభావం తెలిపింది. వైఎస్ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు అఖిలేష్ యాదవ్. ఏపీలోని పరిస్థితులను అఖిలేష్‌కు వైఎస్ జగన్ వివరించారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. అధికారంలోకి వస్తుంటారు.. పోతుంటారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రేపు మళ్ళీ జగన్ సీఎం కావచ్చు. ప్రజల తరఫున గొంతుక వినిపించేందుకు ప్రతిపక్షం ఉండాల్సిందే, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్, ఇంకా ఏమన్నారంటే..
ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సరికాదు. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కార్యకర్తల కోసం జగన్ పోరాటం చేస్తున్నారు. కార్యకర్తలే మళ్లీ జగన్‌ను సీఎం చేస్తారు. టిడిపి ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుంది. భయంతో ప్రజాస్వామ్యంలో గెలవలేరు. అధికారంలో ఈరోజు ఉండొచ్చు లేకపోవచ్చు. ఏపీలో శాంతియుత వాతావరణం నెలకొనాలి. ప్రత్యర్ధుల ప్రాణాలు తీయడం సరికాదు’ అని అన్నారు.
Here's Video
#WATCH | Former Andhra Pradesh CM and YSRCP President Jagan Mohan Reddy along with Samajwadi Party MP Akhilesh Yadav attend one day photo/video exhibition and protest against the Andhra Pradesh Govt at Jantar Mantar, Delhi. pic.twitter.com/x3xmEpNpNg
— ANI (@ANI) July 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)