Rajini Fans vs Jagan Fans: క్షమాపణ చెప్పేది లేదంటున్న వైసీపీ క్యాడర్, చెప్పాల్సిందేనంటున్న రజనీ ఫ్యాన్స్, ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో YSRCPApologizeRAJINI
ఈనేపథ్యంలో వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్‌ను విమర్శించిన వారిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్, చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో వారిని పొగిడారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. దీంతో రజనీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. మంత్రి రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు తదితరులు కోలీవుడ్ సూపర్ స్టార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకి లేదని, ఆయన తమిళనాడులో హీరో కావొచ్చుగానీ ఇక్కడ కాదని, పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. గంటన్నరపాటు మంతనాలు.. రాజకీయ వర్గాల్లో చర్చ
ఈ వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమానులు మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్‌ను విమర్శించిన వారిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.
రజనీ ఎన్టీర్, చంద్రబాబులతో తనకున్న అనుబంధంపై మాత్రమే మాట్లాడారు. ఆయన ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదుకదా’ అంటూ అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. ఇదే క్రమంలో రజనీకాంత్ సినిమాల్లోని ఫేమస్ డైలాగులతో వైసీపీ నాయకులపై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
అయితే దీనిపై వైసీపీ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో కౌంటర్ విసరుతున్నారు. రాజకీయాలు మాట్లాడనంటూ ఏపీకి వచ్చి రాజకీయాలు ఎందుకు మాట్లాడారని విమర్శలు గుప్పిస్తున్నారు. క్షమాపణ చెప్పేదే లేదంటూ తెగేసి చెబుతున్నారు. మరి ఈ ట్విట్టర్ వార్ ఎందాక వెళుతుందో చూడాలి