Hyderabad, April 30: టీడీపీ జాతీయ అధ్యక్షులు (TDP National President) నారా చంద్రబాబు నాయుడుతో (Nara Chandrababu Naidu) జనసేన అధినేత (Janasena President) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భేటీకావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో నిన్న ఇరువురు నేతల సమావేశం గంటన్నర పాటు జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో మూడోసారి చంద్రబాబు.- పవన్ భేటీ జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఘటనపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు పవన్ కళ్యాణ్. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు-పవన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఇరు పార్టీలు కలిసి ఐక్యంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. తెలంగాణ రాజకీయాల పైనా బాబు-పవన్ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది.
Warangal Horror: వరంగల్‌లో దారుణం.. అర్ధరాత్రి ఆటోలో వివాహితపై గ్యాంగ్ రేప్.. అరవడంతో బెదిరింపులు
Pawan Kalyan and Chandrababu Naidu together #Janasena #TDP pic.twitter.com/7bU1QWweBy
— MIRCHI9 (@Mirchi9) April 29, 2023
టీడీపీ జనసేన మధ్య పొత్తు?!
టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్న వేళ ఈ ఇద్దరి భేటీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వీరు భేటీ కాగా తాజా భేటీపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి భేటీపైనే అందరి కళ్లు ఉన్నాయి. కాగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీవ్వమని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.