Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా

రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత మరో ప్రమాదం జరుగుతూ భయాందోళనలు రేపుతున్నాయి.

Representative Image (Photo Credit- PTI)

Hyderabad, Feb 24: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు (Bus Accidents In Telugu States) ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత మరో ప్రమాదం జరుగుతూ భయాందోళనలు రేపుతున్నాయి. మిర్యాలగూడ ఘటన మరవకముందే సోమవారం మరో బస్సు ప్రమాదం (Bus Accident) జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా వెనక టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్నవారంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు పెట్టారు. ప్రమాద సమయంలో మెుత్తం 40మంది ప్రయాణికులు ఉండగా.. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఆపరేషన్ ఎస్ఎల్బీసీ... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. 2023లో ఉత్తరాఖండ్‌ లో 41 మందిని కాపాడింది ఈ టెక్నిక్ ద్వారానే..!

ఏపీలో బస్సు బోల్తా

తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని హాస్పిటల్‌ కు తరలించారు. పుదుచ్చేరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్, ప్రమాద ఘటనపై ఆరా, ఎస్‌ఎల్‌బీసీ డ్రోన్ విజువల్స్ ఇవే  

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement