Toll Rates Increased: టోల్ బాదుడు షురూ.. నేటి అర్ధరాత్రి నుంచి కనిష్టంగా రూ.5 నుంచి రూ.40 వరకు పెరుగనున్న టోల్ ట్యాక్స్
నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.
Hyderabad, June 2: టోల్ బాదుడు మొదలైంది. నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు అన్ని టోల్ ప్లాజాల నిర్వాహకులకు ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు జారీ చేసింది. టోల్ ట్యాక్స్ ను కనిష్టంగా రూ.5 నుంచి రూ.40 వరకు పెంచాలని నిర్ణయించారు. కాగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జూన్ 1న టోల్ రేట్ల(toll rates) పెంపుదల ఉండగా, ఈసారి లోక్ సభ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు.
తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పెరుగనున్నవి ఇక్కడే
తెలంగాణలో పంతంగి, కోరలఫడ్, రాయికల్, గూడూరు, పిప్పల్వాడ, రోల్మమ్డ, గంజల్, మనోహరాబాద్, ఇందల్వాయి, సకాపూర్, పుల్లూరు, భిక్నూర్ టోల్ ప్లాజాలు ఉండగా.. ఏపీలో చిల్లకల్లు, ఆమక్తడు, కాసేపల్లి, మరూర్, సూళ్లూరుపేట, బుధానం, నెల్లూరు, కీసర, కాజా, బెల్లుపాడు, మడపం, చిలక్పెలం, నాతవలస, అగ్నంపాడి, వేంపాడు, కృష్ణవరం, కలపర్రు, పొట్టిపాడు, బొల్లాపల్లి, టంగటూర్, ముసునూరు, పంచవటి కాలనీ, గోష్టని గేట్ ఆఫ్ నేవీ, లక్ష్మీపురం, పాలెంపల్లి, S.V పురం, ఉంగుటూరు, ఈతకోట టోల్ ప్లాజాలు కలవు.
ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..