Voters (Credits: X)

Newdelhi, June 2: సిక్కిం (Sikkim), అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సంబంధించిన కౌంటింగ్ కాసేపటి క్రితం మొదలైంది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయమే కౌంటింగ్ మొదలైంది. కౌంటింగ్ మొదలైన గంట తర్వాత అరుణాచల్‌ లో బీజేపీ, దాని మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) ఆధిక్యంలో కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం కింది లింక్ ను క్లిక్ చెయ్యండి.

అరుణాచల్ ఫలితాలు.. లైవ్

సిక్కిం ఫలితాలు.. లైవ్

ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

కౌంటింగ్ ఈ రోజే ఎందుకంటే?

ఏప్రిల్‌ 19న లోక్‌ సభతోపాటు ఈ రెండు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 60 స్థానాలు ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో పోలింగ్‌కు ముందే 10 నియోజకవర్గాలు ఏకగ్రీవం కాగా.. మిగతా 50 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సిక్కింలోని 32 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. ఎన్నికల షెడ్యూల్‌ లో ఈ రెండు రాష్ర్టాల్లోనూ 4వ తేదీనే కౌంటింగ్‌ ఉంటుందని ప్రకటించిన ఈసీ.. తర్వాత రెండు రోజుల ముందుకు జరిపింది. అరుణాచల్‌, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీల పదవీ కాలం జూన్‌ 2కు ముగియనుండటమే దీనికి కారణం.

98 నుంచి 116 సీట్లతో వైసీపీ అధికారంలోకి, 59 నుంచి 77 సీట్ల మధ్యలో ఆగిపోనున్న టీడీపీ వైసీపీ, Atma Sakshi Exit Poll ఇదిగో..