Vande Bharat Train: సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు..
భారత రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలును కేటాయించింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది.
Hyderabad, Jan 10: తెలుగు రాష్ట్రాల ప్రజలకు (Telugu States) గుడ్ న్యూస్ (Good News). భారత రైల్వే శాఖ (Indian Railway) తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలు (Vande Bharat)ను కేటాయించింది. అయితే ఈ సెమీ హైస్పీడ్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుందన్న దానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ వందేభారత్ రైలు సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖ (Visakha), విశాఖ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుందని వెల్లడించారు.
సికింద్రాబాద్ నుంచి బయల్దేరే వందేభారత్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖ చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలును ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లో ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, 19న తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.