Rains In Telangana: తెలంగాణవాసులకు శుభవార్త.. నేడూ, రేపు వర్షాలు.. ఏపీవాసులకు అలర్ట్.. ఎండలతో జాగ్రత్త అంటూ వాతావరణ శాఖ హెచ్చరిక.. నెల్లూరు జిల్లా కసుమూరులో గరిష్ఠంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు

నేడూ, రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Credits: Twitter

Hyderabad, May 19: ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ (Telangana) వాసులకు ఓ గుడ్‌న్యూస్ (Good news). నేడూ, రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల  తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ (Eastern Madhyapradesh) నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది. ఫలితంగా, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో నేడూ, రేపూ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

BRS Office In AP: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం.. ఎల్లుండే ప్రారంభం.. విజయవాడలో ఎందుకు ఆఫీస్ పెట్టలేదంటే??

ఏపీలో ఇలా..

ఇక భానుడి భగభగలతో ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు వేడిగాలులు తోడవుతుండటంతో ఎండ తీవ్రత మరింత పెరిగింది. గురువారం ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో గరిష్ఠంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీకాకుళం, పల్నాడు, వైఎస్సార్ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు అప్రమత్తతతో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

TS Cabinet Key Decisions: జీవో నంబర్ 111 ఎత్తివేత నుంచి వీఆర్ఏలు రెగ్యుల‌రైజ్ వరకు, తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణ‌యాలు ఇవే

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif