Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో వందేభారత్ రైలు.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో రైలు.. 12న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం

ఏపీ, తెలంగాణ మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రెండో వందేభారత్ కు రైల్వే బోర్డు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Vande Bharat Express (Photo-PTI)

Hyderabad, Mar 10: తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు శుభవార్త. ఏపీ (AP), తెలంగాణ (Telangana) మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రెండో వందేభారత్ కు రైల్వే బోర్డు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ రైలును 12న ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ లో ప్రారంభమైయ్యే వందేభారత్ ఎక్స్ ప్రెస్  మధ్యాహ్నం 1.50 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. వైజాగ్ నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, ఏపీలోని విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్ల కోట మీదుగా ఈ రైలును నడపనున్నారు.

Gold Treasure: 1200 ఏండ్ల నాటి సమాధిలో భారీ బంగారు నిధి.. దాంతో పాటే 32 శవాలు కూడా.. అసలేం జరిగింది??

తొలి వందేభారత్ ఇలా

ఇక వైజాగ్-సికింద్రాబాద్ మధ్య తొలి వందేభారత్ గతేడాది జనవరి 15న పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ రైలుకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉండటంతో వంద శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. చాలా సందర్భాల్లో రిజర్వేషన్ దొరక్కపోవడంతో పాటూ రానుపోను ఒకే రైలు ఉండటంతో తరచూ సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి పరిష్కారంగా అధికారులు రెండో వందేభారత్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

Miss World 2024 Winner Krystyna Pyszkova: మిస్‌ వరల్డ్‌-2024 టైటిల్ గెల్చుకున్న చెక్‌ రిపబ్లిక్‌ భామ క్రిస్టినా..



సంబంధిత వార్తలు

Andhra Pradesh Assembly Session: పీఏసీ చైర్మన్‌ పదవికి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నామినేషన్ టైంలో అసెంబ్లీలో హైడ్రామా

AP Cabinet key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం, ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు

Ram Gopal Varma: ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వర్మ, నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో వెల్లడి

Andhra Pradesh: శాసనమండలిలో సారీ చెప్పిన హోం మంత్రి అనిత, బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడవద్దని చైర్మెన్ సూచన, సభలో శాంతి భద్రతల అంశంపై వాడి వేడీ చర్చ