Newyork, Mar 10: మధ్య అమెరికా దేశమైన పనామాలో (Panama) పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 1200 ఏండ్ల నాటి ఓ సమాధిని గుర్తించారు. ఈ సమాధిలో భారీ యెత్తున బంగారు సంపదను (Gold Treasure) గుర్తించారు. విలువైన బంగారు దుస్తులతో పాటు బెల్ట్ లు, నగలు, తిమింగలం పన్నుతో అలంకరించిన చెవిపోగులు, బ్రాస్‌లెట్లు, గంటలు, సిరామిక్ వస్తువులు వంటివి ఇందులో ఉన్నాయి. అయితే, బంగారమే కాదు ఈ సమాధిలో పలు శవాల అవశేషాలు దొరికాయి.
Archaeologists in Panama find ancient lord's tomb filled with gold treasure and sacrificial victims that's around 1,200 years old https://t.co/VRYbtvABLr pic.twitter.com/fL2TZIUu83
— Daily Mail Online (@MailOnline) March 8, 2024
కోక్లే సంస్కృతికి చెందిన ఒక ఉన్నతస్థాయి వర్గానికి చెందిన ప్రభువు సమాధిలో వీటిని గుర్తించారు. అప్పటి పోకడల ప్రకారం.. చనిపోయిన ఉన్నతస్థాయి వ్యక్తితో పాటు వారికి తోడుగా ఉండేందుకు బలిదానం చేసిన దాదాపు 32 మంది శవాల అవశేషాలను కూడా ఆ సమాధిలోనే గుర్తించినట్టు పురావస్తు శాస్త్రవేత్త జులియో మాయో తెలిపారు.