Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!
అయితే, దీని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది.
Hyderabad, Nov 15: బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది. అయితే, దీని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోని కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి జిల్లా, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో సాధారణ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు.
శివాలయంలోకి ఒకేసారి చొరపడ్డ మూడు ఎలుగుబంట్లు.. భయంతో పరుగెత్తిన జనాలు (వీడియో)
తెలంగాణపై ఇలా...
అటు అల్పపీడనం తెలంగాణపై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడతాయని అధికారులు వెల్లడించారు.