Bears at Lord Siva Temple (Credits: X)

Srikakulam, Nov 15: ఏపీలోని (Andhrapradesh) శ్రీకాకుళం జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివాలయంలో (Lord Siva Temple) భక్తులు పూజలు చేస్తుండగా.. ఉన్నట్టుండి ఆలయంలోకి ఒకేసారి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. టెంపుల్ ప్రాంగణం నుంచి లోనికి ఎలుగులు వస్తుండటాన్ని గమనించిన భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఎలుగుబంట్లు మాత్రం ఆలయం మొత్తం కలివిడిగా తిరిగినట్లు టెంపుల్‌ లో ఏర్పాటు చేసి సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.

కార్తీక పౌర్ణమి.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు

Here's Video: 

బయటకు రావాలన్నా భయమే

ఎలుగుల రాకపై గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులకు సమాచారం అందించారు. కాగా, ఎలుగుబంట్ల సంచారంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా గ్రామస్థులు జంకుతున్నారు.

తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల స్వర్ణ వైజయంతీ మాల విరాళం, బహుకరించిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య...వీడియో ఇదిగో