IPL Auction 2025 Live

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, నేటి నుంచి ఈసీ 3 రోజుల పర్యటన, గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం

ఇందులో భాగంగా నేటి(మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించనున్నారు.

Election Commission of India. (Photo Credit: Twitter)

Hyd, Oct 3: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలొ ఈసీ వేగం పెంచింది. ఇందులో భాగంగా నేటి(మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించనున్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సీఈసీ రాజీవ్‌కుమార్‌, ఉన్నతాధికారులు మూడు రోజులపాటు ​ఎన్నికల సంఘం సమావేశం కానున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, మోడల్‌ కోడ్‌ సహా పలు అంశాలపై చర్చించారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 నుండి 4.30 వరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం అవ్వనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు పలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో సమీక్షించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, అధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.

టైమ్స్‌ నౌ తాజా సర్వే ఫలితాలు ఇవిగో, ఏపీలో మళ్లీ జగన్ సర్కారే, తెలంగాణలో కారు జోరు, కేంద్రంలో మళ్లీ ఎన్టీయే ప్రభంజనం అంటున్న సర్వే..

ఇక 4వ తేది ఉదయం 6.30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై సైక్లోథాన్, వాక్ థాన్ నిర్వహించనుంది. ఉదయం 9.30 గంటల నుంచిసాయంత్రం 7 వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో ఎన్నికల బృందం సమావేశమవ్వనుంది. 5వ తేదీ ఉదయం 9 గంటలకు టెక్ మహీంద్రలో స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఇంటరాక్షన్ అవ్వనుంది. 11 గంటలకు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. అలాగే మధ్యాహ్నాం 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్, ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై కేంద్ర ఎన్నికల బృందం ఆరా తీయనుంది. అన్నీ కుదిరితే ఈ నెల 6 లేదా 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం.