Woman Alleges Rape by 139 People: 11 ఏళ్ల నుంచి 139 మంది నన్ను రేప్ చేశారు, పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన యువతి, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు

పాతికేళ్ల యువతి తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ శనివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు (Woman Alleges Rape by 139 People) చేసింది. 11 ఏళ్లుగా 143 మంది రేప్ చేశారంటూ ఆ యువతి పంజాగుట్ట పీఎస్ లో (Panjagutta Police Station) ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన వారిలో సినీ నటులు, యాంకర్లు, విద్యార్థి సంఘ నాయకులున్నట్లు ఆమె ఆరోపిస్తోంది. యువతి ఫిర్యాదు మేరకు 139 మందిపై కేసు నమోదు చేశారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Hyderabad, August 24: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఓ సంచలన కేసు రిజిస్టర్ అయింది. పాతికేళ్ల యువతి తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ శనివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు (Woman Alleges Rape by 139 People) చేసింది. 11 ఏళ్లుగా 143 మంది రేప్ చేశారంటూ ఆ యువతి పంజాగుట్ట పీఎస్ లో (Panjagutta Police Station) ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన వారిలో సినీ నటులు, యాంకర్లు, విద్యార్థి సంఘ నాయకులున్నట్లు ఆమె ఆరోపిస్తోంది. యువతి ఫిర్యాదు మేరకు 139 మందిపై కేసు నమోదు చేశారు.

గాడ్‌ పవర్‌ ఫౌండేషన్‌ సంస్థ వారిని కలిశానని, వారిచ్చిన ధైర్యం, సహకారంతోనే పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. ఈ మేరకు 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నిర్భయ చట్టంతో పాటు ఐపీసీ 376 సెక్షన్, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపడుతున్నామని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

ఇప్పటికే భరోసా సెంటర్లో సదరు మహిళకు (Hyderabad woman) పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా మహిళకు మనోధైర్యం కల్పించేందుకు మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం 139 మందిని పోలీసులు విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం వారి ఫోన్ నెంబర్లు ఇవ్వాలని సదరు మహిళను పోలీసు అధికారులు కోరారు. మహిళ దగ్గర నుంచి కాంటాక్ట్ నెంబర్‌తో పాటుగా సంబంధిత అడ్రస్‌లను కూడా అధికారులు తీసుకున్నారు. భార్య-భర్తల మధ్య విభేదాలు, కృష్ణానదిలో దూకి డాక్టర్ ఆత్మహత్య, గోదావరి నదిలో దూకి మరొకరు ఆత్మహత్యా ప్రయత్నం, ఇంకో చోట భార్య నీటి కుంటలో దూకి కుమార్తెతో సహా ఆత్మహత్య

ఈ కేసు విచారణను ఎలా కొనసాగించాలి?ఎవరికి అప్పగించాలన్న విషయం ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆమె ఫిర్యాదు చేసిన వారిలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ కేసులో లీగల్ ఎక్స్ పర్ట్స్ సలహా లేకుండా ముందుకు వెళ్లరాదని పోలీసు అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడు సమావేశం కానున్న ఉన్నతాధికారులు, డీజీపీ అనుమతిస్తే, సీఐడీ చేతికి కేసును ఇవ్వాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం బాధితురాలిని ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో ఉంచి, నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఆమె మానసిక ఒత్తిడితో ఉందని వెల్లడించిన ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, మహిళా అధికారుల సహాయంతో ఆమెను ప్రశ్నించి, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ఏసీపీని, ఆయనకు సహాయంగా నలుగురు ఇన్ స్పెక్టర్ల బృందానికి కేసును అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో దారుణం, 12 ఏళ్ల బాలికను క్రూరంగా హింసిస్తూ రేప్ చేసిన కామాంధులు

ఘటన వివరాల్లోకెళితే.. నల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌లం సెట్టిపాలెం గ్రామంకు చెందిన మహిళకు చిన్నప్పుడే వివాహం జరిగింది. వివాహమైన ఆరు నెలలలోపే భర్తతో విడాకులు తీసుకుంది. తన భర్త అత్తమామలతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి తనపై లైంగిక దాడులు (Sexually Assaulted) చేశారని పేర్కొంది. ఈ దాడులను తట్టుకోలేక తాను విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయానని వెల్లడించింది. పుట్టింటికి వెళ్ళి చదువుకొనే సమయంలో తాను సుమన్ అనే వ్యక్తి చేతిలో మోసపోయానని తెలిసినట్లు వివరించింది. ఆ తర్వాత తాను హైదరాబాద్‌కు చేరుకున్నానని వెల్లడించింది.

అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత తనపై ఇప్పటివరకు 139 మంది వివిధ ప్రాంతాల్లో, వివిధ స్థలాల్లో తనపై అత్యాచారం జరిపారని పేర్కొంది. ఇందులో పలువురు నటులు, రాజకీయ నాయకులు, మీడియాకు సంబంధించిన ఇద్దరు ప్రముఖులు కూడా ఉన్నట్లుగా ఆరోపించింది. పోలీసులు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపైన 113 పేజీలతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఫిర్యాదు గురించి పంజాగుట్ట పోలీస్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. తండ్రి, తాతే కామాంధులు అయ్యారు, తమిళనాడులో బాలికపై అత్యాచారం, ఇద్దరూ పోక్సో చట్టం కింద అరెస్ట్, బాలిక ప్రెగ్నెన్సీని తొలగించడానికి కోర్టు అనుమతి

దీని అంతటికి కారణం సుమన్ అనే వ్యక్తి అని పోలీసులు భావిస్తున్నారు. బాధిత మహిళను నమ్మించి సుమన్ దేశంలోని పలు ప్రాంతాలు..ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోలకతా, నాగ్‌పూర్, పుణె లాంటి ప్రదేశాలకు తీసుకువెళ్ళాడు. అక్కడ తన ఫ్రెండ్స్‌తో బాధిత మహిళపై రేప్ చేయించాడు. కొన్ని సందర్భాల్లో మెడపై కత్తి పెట్టి రేప్ చేశారు. మరికొన్ని సమయాల్లో బాధిత మహిళతో సెక్స్ చేస్తున్న సమయంలో వీడియో తీశారు. నగ్నంగా ఫోటోలు కూడా తీశారు. ఇలా దేశవ్యాప్తంగా మహిళను పలు ప్రాంతాలకు తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తుంది. అయితే, ఈ కేసు మొత్తానికి మూల కారణం సుమన్ కావడంతో ప్రస్తుతానికి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2011 నుంచి ఇప్పటివరకు 139 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పంజాగుట్ట పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.



సంబంధిత వార్తలు

Fake Cop Video Calls Real Cyber Security Police: సైబ‌ర్ క్రిమిన‌ల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియ‌ల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

Kodangal Lagacherla Incident: ఏ1గా బోగమోని సురేష్, లగిచర్ల ఘటనపై పోలీసుల రిమాండ్ రిపోర్ట్, పథకం ప్రకారమే దాడి చేశారని వెల్లడి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న పోలీసులు

Telangana: వీడియో ఇదిగో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళన, వారంలో ఒకసారి ఉండే జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ రద్దు కావడంపై నిరసన

HC on Sex After Marriage Promise: ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పాల్గొని తర్వాత రేప్ కేసు పెడతానంటే కుదరదు, కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు