Representational Image (Photo Credits: Pixabay)

Amaravati, August 24: చిన్న చిన్న గొడవలతో పచ్చని సంసారాలు కకావికలమవుతున్నాయి. సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడంతో ప్రాణాలు తీసుకుంటూ కుటుంబానికి వేదన మిగిలుస్తున్నారు. రోజు ఇలాంటి ఘటనలో ఎక్కడో ఓ చోట జరగుతూనే ఉన్నాయి. భార్య భర్తల మధ్య విభేధాలు (Husband-Wife Conflicts) తలెత్తితే ఆత్మహత్య శరణ్యమనే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. కొన్ని చోట్ల వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చును పెడుతున్నాయి. ఇలాంటి సంఘటలను ఓ సారి చూస్తే..

భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్యుడు (govt-doctor) అందరూ చూస్తుండగానే కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ప్రకాశం జిల్లా వాసి డాక్టర్‌ అద్దేపల్లి శ్రీనివాస్‌ (40) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు కొత్తపేటలో భార్యాపిల్లలతో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో డా. శ్రీనివాస్‌ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని ప్రకాశం విగ్రహం వద్ద మెయిన్‌ కెనాల్‌లోకి దూకేశారు. అంతకుముందు తన జేబులో ఉన్న ఐడీకార్డు, ఆధార్, ఫోన్‌లను తీసి పక్కనే పెట్టేశారు.

ఈ హఠాత్పరిణామాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే ఉన్న విజయవాడ వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో తాడు సాయంతో శ్రీనివాస్‌ను పైకి తేవడానికి ప్రయత్నించారు. నీటి వడి ఎక్కువగా ఉండటంతో అందరూ చూస్తుండగానే శ్రీనివాస్‌ కనపడకుండా మునిగిపోయారు. అతను వదిలేసిన ఫోన్‌లో నంబర్ల ఆధారంగా తండ్రికి ఫోన్‌ చేయగా.. భార్యాభర్తలమధ్య గొడవ జరిగిందని ఆయన తెలిపారు.

రాజమండ్రిలో గోదావరిలోకి దూకిన వృద్ధుడు

రాజమండ్రిలో భార్యతో గొడవ పడి గోదావరిలోకి దూకి ఆత్మహత్యా యత్నానికి (suicide Attempt) పాల్పడిన వృద్ధుడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడిన సంఘటన టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక తాడితోటకు చెందిన జి.అప్పారావు (73) కొంత కాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపం చెందిన అతడు గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఇస్కాన్‌ టెంపుల్‌ వద్ద రేవులోకి వచ్చి గోదావరిలో దూకాడు. అయితే ఈత రావడంతో ఆయన ఓ దుంగకు పట్టుకుని అలాగే కూర్చున్నాడు. ప్లీజ్..నా భార్యను బతికించండి, అర్థరాత్రి గాంధీ ఆస్పత్రి వద్ద కన్నీటి వేదనతో హెడ్ కానిస్టేబుల్, కనికరం చూపని పోలీసులు, కళ్లముందే ప్రాణాలు విడిచిన కానిస్టేబుల్ భార్య

ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన 100 నంబర్‌కు సమాచారం అందించారు. సౌత్‌ జోన్‌ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు టూ టౌన్‌ మహిళా ఎస్సై జె.లక్ష్మి, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్, కానిస్టేబుల్‌ దొర సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇన్‌చార్జ్‌ అగ్నిమాపక అధికారి ఉమామహేశ్వరరావు, డ్రైవర్‌ అండ్‌ ఆపరేటర్‌ వై.అనిల్‌కుమార్, ఫైర్‌ మెన్‌ ఎస్‌.రాంబాబు, జేబీ సాగర్, జీపీఎం కుమార్‌ వెంటనే అక్కడకు చేరుకున్నారు. గోదావరి మధ్యలో దుంగపై ఉన్న అప్పారావు వద్దకు తాడుకు లైఫ్‌ జాకెట్‌ కట్టి విసిరారు. అతడు ఆ తాడు పట్టుకున్న తరువాత ఒడ్డుకు చేర్చారు. అప్పారావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు.

భర్త వివాహేతర సంబంధం.. మూడేళ్ల కుమార్తెతో సహా భార్య ఆత్మహత్య

భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మూడేళ్ల కుమార్తెతో సహా భార్య ఆత్మహత్య చేసుకుంది.ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలులోని ఆలూరులోని గోవర్ధన్‌ టాకీస్‌ సమీపంలో నివాసముంటున్న ఏక్‌నాథ్‌ ఈరన్న, హైమావతి కుమారుడు నాగార్జునకు కర్ణాటకలోని శిరుగుప్ప తాలూకా దరూరు గ్రామానికి చెందిన చంద్రప్ప, వన్నూరమ్మ కుమార్తె శిల్పా (24)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్ఞానేశ్వరి (3) అనే కుమార్తె ఉంది. నాగార్జునకు పట్టణానికే చెందిన మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఏడాది క్రితం నుంచి ఆ అమ్మాయితో కలిసి వేరే ప్రాంతంలో కాపురం పెట్టాడు. విషయం తెలిసినా శిల్పా ఏమీ చేయలేక.. అత్తామామ దగ్గర ఉండేది. హిజ్రా అని పిలుస్తున్నారంటూ యువకుడు ఆత్మహత్య, ఉత్తర ప్రదేశ్‌లో విషాద ఘటన, హిజ్రాలతో మాట్లాడితే కరోనా వస్తుందంటూ హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం

నాగార్జున తన ప్రియురాలిని అప్పుడప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చేవాడు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి శిల్పాను మానసికంగా వేధించేవారు. ఇటీవల కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇక తన భర్త ప్రవర్తనలో మార్పు రాదని భావించిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తానొక్కతే చనిపోతే బిడ్డ అనాథ అవుతుందని భయపడింది. శనివారం అత్తమామలతో కలిసి పొలానికి వెళ్లింది. అందరూ పొలం పనులలో నిమగ్నమై ఉండగా.. శిల్పా బిడ్డతో సహా సమీపంలోని నీటికుంటలో దూకింది. పొలంలో పనిచేస్తున్న వారు గమనించి బయటకు తీసేలోపు ఇద్దరూ ప్రాణాలు విడిచారు. మృతదేహాలకు ఆలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

భార్యను గొంతు కోసి దారుణంగా హత్య చేసిన భర్త

చిత్తూరు జిల్లాలో ఆస్తి వివాదం నేపథ్యంలో భార్యను గొంతు కోసి దారుణంగా ఓ భర్త హత్య చేశాడు.కుప్పిగానిపల్లెకు చెందిన పశుపతి(43), ఇదే మండలంలోని గొల్లపల్లెకు చెందిన ప్రతిభ (34)కు 2006లో పెద్దలు వివాహం చేశారు. వీరికి వేదేష్‌(12), పవన్‌(5) సంతానం. పశుపతి వృత్తిరీత్యా బెంగళూరులో లిఫ్ట్‌ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఐదేళ్ల క్రితం తనే స్వయంగా లిఫ్ట్‌ కంపెనీ ప్రారంభించాడు. కంపెనీ బాగా అభివృద్ధి చెందుతున్న సమయంలో పశుపతి మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు తలెత్తేవి. గుడిపాల పోలీస్‌స్టేషన్‌లో కూడా గతంలో దంపతులిద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించి సర్దిచెప్పి పంపారు. గ్రామంలో కూడా పెద్దమనుషుల సమక్షంలో పలు పంచాయితీలు చేశారు. తరువాత దంపతులు కలిసి బెంగళూరుకు వెళ్లారు. అయినా పశుపతి తీరు మారలేదు.

మరింతగా తాగుడుకు అలవాడు పడటంతో విసిగి వేసారిన ప్రతిభ ఏడాది క్రితం భర్త నుంచి కంపెనీని తన పేరిట రాయించుకుంది. అప్పటినుంచి కంపెనీ వ్యవహారాలన్నీ ఆమే చూసుకునేది. దీనిపై పశుపతి ఆమెతో విభేదించాడు. తన ఇద్దరి పిల్లలను తీసుకుని తన స్వగ్రామానికి వచ్చేశాడు. ఇక్కడే ఉంటూ జీవిస్తున్నాడు. గ్రామస్తులు ఇది గమనించి మళ్లీ మధ్యస్థం చేశారు. అతడిని ఒప్పించి తిరిగి బెంగళూరుకు పంపారు. అయినా భార్యభర్తల మధ్య మళ్లీ గొడవలు వస్తుండడంతో తిరిగి వచ్చేశాడు. అయితే అప్పటినుంచి పశుపతికి భార్యపై అనుమానం మొదలైంది.

ప్రతిభ వినాయకచవితి పండుగ సందర్భంగా తన పుట్టింటికి వచ్చింది. ఇది తెలుసుకున్న పశుపతి తన ఇంటికి రావాలంటూ ఆమెను నమ్మించి శనివారం తీసుకువచ్చాడు. సాయంత్రం మిద్దెపైన ఉన్న రూమ్‌లోకి ప్రతిభను తీసుకెళ్లి కట్టెతో తలపై బాదాడు. ఆ తరువాత కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. సంఘటన స్థలానికి సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ వాసంతి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను హతమార్చిన పశుపతిని పోలీసుల అదుపులోకి తీసుకున్నాడు. హత్య ఎందుకు చేశాడో వివరాలు రాబట్టే దిశగా విచారణ చేస్తున్నారు. తల్లిని తమ తండ్రే హత్య చేయడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.