Hyderabad, July 29: తెలంగాణలో గాంధీ ఆస్పత్రి వద్ద (Gandhi hospital) మానవత్వం చనిపోయే ఘటన (RIP Humanity) చోటు చేసుకుంది. నా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందని ఓ హెడ్ కానిస్టేబుల్ గాంధీ ఆస్పత్రి వద్ద ఉన్న పోలీసులను వేడుకున్నా లోపలికి అనుమతించకపోవడంతో ఆమె అతని కళ్లముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కరోనా, రామంతాపూర్‌లో ఒకే కుటుంబంలో 10 మందికి కోవిడ్-19, తెలంగాణలో కొత్తగా 1,764 కేసులు..12 మంది మృతి, రాష్ట్రవ్యాప్తంగా 58,906 కు చేరిన మొత్తం కోవిడ్ కేసులు
విషాధ ఘటన వివరాల్లోకెళితే.. తుర్కపల్లి పోలీస్ స్టేషన్ లో లతీఫ్ హెడ్ కానిస్టేబుల్ గా (Telangana Head Constable Latif) పనిచేస్తున్నారు. అతడి భార్యకు ఉన్నట్టుండీ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతోంది. అయితే అది కరోనా వైరస్ సోకడమో.. లేక మరే కారణమో స్పష్టంగా తెలియక పోవడంతో అతను అర్థరాత్రి సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా చేర్చుకోకపోవడంతో అర్థరాత్రి సమయంలో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే శ్వాస తీసుకోవడంలో మరింతగా ఇబ్బంది పడుతోంది. కానీ గాంధీ ఆస్పత్రిలోకి అనుమతి లేదంటూ అక్కడ విధుల్లో ఉన్న ఓ సీఐ నిరాకరించాడు.
Here's Head Constable Emotional Video
లతీఫ్ కానిస్టేబుల్, (తుర్కపల్లి పోలీస్ స్టేషన్) మాటలు వినండి సాక్షాత్తు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆసుపత్రిలో మాట్లాడి, తన చేతిలో డబ్బు ఉన్న తన భార్యని కాపాడుకొలేక పోయానని వాపోయిన తీరు.. వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యులు ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. pic.twitter.com/KpGhrcU1x8
— ABVP Telangana (@ABVPTelanagana) July 29, 2020
తాను ఓ హెడ్ కానిస్టేబుల్‌నని.. నా భార్య పరిస్థితి విషయంగా ఉందని చెప్పినా లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్‌లోని అన్ని ఆస్పత్రులు తిప్పాను. కరోనా ఉందో లేదు తెలియదు సర్ అన్నా పట్టించుకోలేదు. చివరకు అడిషనల్ డీసీపీతో ఫోన్ చేయించినా ఫలితం లేకపోయింది. సీఐ కనికరించలేదు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సదరు సీఐ వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టాడు.
వేరే ఆస్పత్రికైనా తీసుకెళదామంటూ అక్కడి నుంచి హెడ్ కానిస్టేబుల్ భార్యను తీసుకుని కిలోమీటరు వెళ్లాడో లేదో భార్య ప్రాణాలు వదిలింది. ఊపిరాడక కాళ్లు చేతులు గిలగిలా కొట్టుకుంటూ నరకయాతన అనుభవిస్తూనా కళ్లముందే చనిపోయిందంటూ హెడ్ కానిస్టేబుల్ లతీఫ్ కన్నిటీ పర్యంతమయ్యాడు. ఈ విషాదాన్ని అతను వీడియో ద్వారా తెలిపాడు.