Telangana Covid-19: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కరోనా, రామంతాపూర్‌లో ఒకే కుటుంబంలో 10 మందికి కోవిడ్-19, తెలంగాణలో కొత్తగా 1,764 కేసులు..12 మంది మృతి, రాష్ట్రవ్యాప్తంగా 58,906 కు చేరిన మొత్తం కోవిడ్ కేసులు
Coronavirus in India (Photo-PTI)

Hyderabad, July 29: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,764 కరోనా కేసులు (COVID-19 in Telangana) నమోదు అయ్యాయి. కరోనావైరస్ బారిన పడి 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్-19తో మృతి చెందిన వారి సంఖ్య 492కు ( Coronavirus Death Toll) చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 58,906 మందికి కరోనా పాజిటివ్ గా (Telangana Covid-19) నిర్ధారణ అయ్యింది. వీరిలో 43,751 మంది కోలుకోగా మరో 14,663 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని బుధవారం రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటిన్‌లో వెల్లడించారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 18,858 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇండియాలో 15 లక్షలు దాటిన కరోనావైరస్ కేసులు, భయపెడుతున్న మురికివాడలు, పెరుగుతున్న రికవరీ రేటు, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.84 శాతంగా ఉంది. జాతీయ సగటు 2.26 శాతంతో పోలిస్తే ఇదెంతో తక్కువ. కరోనా మరణాల్లో గోప్యత లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా మరణాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్న ఆయన.. సాధారణ మరణాలను కరోనా జాబితాలో చేర్చలేమన్నారు. అమెరికా లాంటి పరిస్థితులు ఇక్కడ లేవన్నారు. రాష్ట్రంలో 81 శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదన్న మంత్రి.. ర్యాపిడ్ టెస్టుతో అరగంటలోనే ఫలితం వస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు ఉన్నాయన్న ఈటల.. ప్రయివేట్ హాస్పిటళ్లకు వెళ్లి డబ్బులు వృథా చేయొద్దన్నారు. ఐసోలేషన్‌ వార్డులో లైంగిక దాడి, కరోనా సోకిన మహిళపై మరో కరోనా సోకిన డాక్టర్ అసభ్య ప్రవర్తన, నోయిడాలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు

జీహెచ్‌ఎంసీలో (GHMC) అత్యధికంగా మరో 509 కేసలు నమోదు కాగా మేడ్చల్‌లో 158, రంగారెడ్డిలో 147, వరంగల్‌ అర్బన్‌లో 138, కరీంనగర్‌లో 93, సంగారెడ్డిలో 89, ఖమ్మంలో 69, నల్గొండలో 51, నిజామాబాద్‌లో 47 కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 47, పెద్దపల్లిలో 44, వరంగల్‌ గ్రామీణంలో 41, సూర్యపేటలో 38,భద్రాది కొత్తగూడెంలో 30, నాగర్‌కర్నూలులో 29, మంచిర్యాలలో 28 కేసులు నమోదు అయ్యాయని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,97,939 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు సోకిన కరోనావైరస్, లక్షణాలు బయటపడకపోయినా పాజిటివ్‌గా నిర్ధారణ

ఇక రామంతాపూర్‌, హబ్సిగూడలలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు, భార్య, భర్తతోపాటు మరో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషుల కలిపి మొత్తం పది మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అలాగే మెదక్‌లో ఒక కుటుంబంలో ఐదుగురు, మరో కుటుంబంలో ఎనిమిది మంది కరోనా బారినపడ్డారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్‌ బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు. ఇక నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ ఇటీవల కోవిడ్‌బారినపడి చికిత్స పొందుతున్నారు.