Fire Accident In Mancherial: మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. నిద్రలోనే ప్రాణాలు గాలిలోకి.. ఎవరో కావాలనే ఇంటికి నిప్పు పెట్టినట్టు అనుమానాలు.. వీడియోతో..
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటికి నిప్పు అంటుకున్న ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు.
Mancherial, Dec 17: తెలంగాణలోని (Telangana) మంచిర్యాల (Mancherial) జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఇంటికి నిప్పు అంటుకున్న ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఇలా నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. మందమర్రి మండలం వెంకటాపూర్‌లో జరిగిందీ ఘటన. ఇంటి యజమాని శివయ్య (50), ఆయన భార్య పద్మ (45), ఆమె అక్క కుమార్తె మౌనిక(23), మరో ఇద్దరు చిన్నారులతో పాటు సింగరేణి ఉద్యోగి శాంతయ్య (50) ఈ ఘటనలో మృతి చెందారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Rescue Team) మంటలను అదుపు చేశారు. ఇంటికి మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై పోలీసులు (Police) దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇంటికి నిప్పు పెట్టినట్టు అనుమానిస్తున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement