Pathetic Incident In Siddipet: వంతుల వారీగా తండ్రిని చూసుకోవాలని పెద్ద మనుషుల తీర్పు.. జీర్ణించుకోలేకపోయిన ఆ 90 ఏండ్ల పెద్దాయన ఏం చేశాడో తెలుసా? సొంతగా చితి పేర్చుకుని.. ఆ తర్వాత.. సిద్దిపేట జిల్లాలో హృదయాన్ని పిండేసే ఘటన

మానవతావాదులు కన్నీరుపెట్టుకునే ఘటన ఇది. కుమారులు తనను వంతులవారీగా పోషించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ 90 ఏండ్ల వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Venkatayya (Credits: Google)

Siddipet, May 5: సిద్దిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్ (Husnabad) మండలం పొట్లపల్లిలో జరిగిన తాజా ఘటన అందరి హృదయాలను పిండేస్తోంది. మానవతావాదులు కన్నీరుపెట్టుకునే ఘటన ఇది. కుమారులు తనను వంతులవారీగా పోషించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ 90 ఏండ్ల వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు (Police), గ్రామస్తులు (Villagers) తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్యకు నలుగురు కుమారులు, ఓ కుమార్తె. వెంకటయ్య భార్య గతంలోనే మరణించింది. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న కుమారులకు వెంకటయ్య తనకున్న నాలుగు ఎకరాల భూమిని ఎప్పుడో పంచేశారు.

Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గత రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం

ఒక్కో కొడుకు దగ్గరకు..

వృద్ధాప్య పింఛను తీసుకుంటూ స్వగ్రామంలో ఉంటున్న పెద్ద కొడుకు కనకయ్య వద్ద వెంకటయ్య ఉండేవారు. అయితే, తండ్రి పోషణ బాధ్యత తనదొక్కడిదే కాదన్న విషయంలో ఐదు నెలల క్రితం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ సందర్భంగా నెలకొకరు చొప్పున వంతుల వారీగా తండ్రిని చూసుకోవాలని పెద్ద మనుషులు తీర్పు చెప్పారు. దీంతో నవాబుపేటలో ఉంటున్న మరో కుమారుడి వద్దకు ఈ నెల 3న  వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ నెల 2న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికెళ్లి రాత్రికి అక్కడే ఉన్నారు. ఆయనతో ఆ రాత్రి తన బాధలు చెప్పుకున్నారు.

Penumbral Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం.. మళ్లీ ఇలాంటి గ్రహణం కోసం 2042 వరకు ఆగాల్సిందే.. నేటి చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే? భారత్‌లో ఈ గ్రహణ ప్రభావం ఉంటుందా మరి??

బయలుదేరి.. ఆ తర్వాత??

తర్వాతి రోజు అక్కడి నుంచి బయలుదేరి నవాబ్‌పేటకు మాత్రం చేరుకోలేదు. తనను వంతులవారీగా లెక్కలు వేసుకుంటూ కుమారులు పోషించడాన్ని తట్టుకోలేని వెంకటయ్య.. తాటికమ్మలను ఒక్కచోట కుప్పగా వేసి దానికి నిప్పంటించి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.