Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గత రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం
తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Hyderabad, May 5: ఎర్రని ఎండాకాలంలో తెలంగాణలో (Telangana) భిన్నమైన వాతావరణం ఏర్పడుతున్నది. రాష్ట్రంలో వాతావరణం మళ్లీ మారిపోయింది. నిన్న రాత్రి హైదరాబాద్ (Hyderabad) సహా మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయ్యాయి. ట్రాఫిక్‌కు (Traffic) అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. తెలంగాణలో నేడు కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఎల్లుండి అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడి, దాని ప్రభావంతో ఎల్లుండి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 8న అది వాయుగుండంగా కేంద్రీకృతమవుతుందని, అనంతరం ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించింది.
(The above story first appeared on LatestLY on May 05, 2023 08:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

