IPL Auction 2025 Live

Fire Mishap in New Secretariat: ప్రారంభానికి ముందే తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం, తెల్లవారుజామున కలకలం, అదుపులోకి వచ్చిన మంటలు

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో తెల్లవారుజాము 3:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం (fire mishap) సంభవించింది. కొత్త సచివాలయం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. భవనం కుడివైపు కొద్ది సేపు మంటలు ఎగబాకాయి.

Telangana New Secretariat (Photo-TS CMO)

Hyderabad, FEB 03: తెలంగాణ నూతన సచివాలయంలో (new Secretariat) అగ్నిప్రమాదం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో తెల్లవారుజాము 3:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం (fire mishap) సంభవించింది. కొత్త సచివాలయం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. భవనం కుడివైపు కొద్ది సేపు మంటలు ఎగబాకాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే సచివాలయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కొత్త సచివాలయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే ఎన్ టీఆర్ మార్గ్ రోడ్డును రెండు వైపులా మూసివేశారు. దీంతో ఉదయం పూట వెళ్లే వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉడ్ వర్క్ జరుగుతున్న చోట షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

సచివాలయం మొదటి ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించడంతోపాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. సచివాలయం కుడి వైపు వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సచివాలయానికి చేరుకున్నారు. 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి గంటన్నర సమయంలోనే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

Telangana Assembly Budget 2023: రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచన 

అయితే, షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం జరగడంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ అగ్నిప్రమాదం ఎలా జరిగింది? అగ్నిప్రమాదానికి గల కారణాలేంటి? అన్న విషయాలపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.