Purse Saves Women: బస్సులో పారేసుకున్న పర్సు యువతి ప్రాణాలు కాపాడింది.. హైదరాబాద్ లో ఘటన

ఓ యువతి బస్సులో ప్రయాణిస్తూ పారేసుకున్న పర్సు ఆమె ప్రాణాలను కాపాడింది. హైదరాబాద్ లో జరిగిందీ ఘటన.

Credits: Twitter

Hyderabad, Dec 26: నిజజీవితంలో కొన్నిసార్లు జరిగే సాధారణ ఘటనలు ఊహించని ఫలితాలను ఇస్తాయి. ఓ యువతి బస్సులో ప్రయాణిస్తూ పారేసుకున్న పర్సు (Purse) ఆమె ప్రాణాలను కాపాడింది. హైదరాబాద్ (Hyderabad) లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  పఠాన్‌చెరువులో బస్సెక్కిన (Bus) ఓ యువతి సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌లో (JBS) దిగింది.

నన్ను పెళ్లి చేసుకో అన్నందుకు నడిరోడ్డుపై యువతిని చావబాదిన ప్రియుడు.. అయినప్పటికీ, ఫిర్యాదు వద్దన్న బాధితురాలు.. అయితే, అధికారులు ఏం చేశారంటే?? వీడియోతో..

ప్రయాణికులందరూ బస్సు దిగాక కండక్టరుకు బస్సులో ఓ పర్సు కనిపించింది. అదెవరిదో తెలుసుకుందామని పర్సు తెరిచిన ఆయనకు అందులో కొన్ని డబ్బులతో పాటు ఓ లేఖ కూడా కనిపించింది. తెరిచి చూసిన ఆయన షాకయ్యాడు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు అందులో రాసి ఉండడంతో వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు సమాచారం అందించాడు. పర్సులోని ఆధార్ కార్డు, సూసైడ్ లెటర్‌ను ఎండీకీ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అప్రమత్తమైన ఆయన యువతిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలంటూ సిబ్బందిని ఆదేశించారు.

అల్పపీడన ప్రభావం.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి

రంగంలోకి దిగిన ఆర్టీసీ ఎస్సై దయానంద్.. మారేడుపల్లి పోలీసుల సాయంతో యువతి కోసం గాలించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించాయి. యువతిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుమార్తెను రక్షించి తమకు అప్పగించిన ఆర్టీసీ అధికారులు, పోలీసులకు యువతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకుందన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif