Adibatla Medico Kidnap Case: ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో, తల్లిదండ్రులకు భయపడే వైశాలి ఈ విధంగా చేసిందంటూ అందులో వెల్లడి
తాజాగా నిందితుడు నవీన్ రెడ్డి (Naveen Reddy ) గంటపాటు మాట్లాడిన వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో అనేక అనుమానాలకు తావిస్తోంది.
Hyd, Dec 15: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసు (Adibatla Medico Kidnap Case) రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నిందితుడు నవీన్ రెడ్డి (Naveen Reddy ) గంటపాటు మాట్లాడిన వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో అనేక అనుమానాలకు తావిస్తోంది. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియోను విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే చూపించారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వీడియో ప్రకారం.. వైశాలికి నవీన్‌రెడ్డితో సాన్నిహిత్యం ఉందా, వారి వివాహం జరిగిందా? నవీన్ రెడ్డి (Naveen Reddy Video) చెబుతున్నది నిజమేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ వీడియోని నవీన్ రెడ్డి సన్నిహితులు విడుదల చేశారు. అందులో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్‌లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రులకు భయపడే వైశాలి ఈ విధంగా చేసిందంటూ వీడియోలో పేర్కొన్నాడు.
ఆ కిడ్నాప్ (Adibatla Medico Kidnap Case) కూడా వైశాలిని ఒప్పించడానికి మాత్రమే తీసుకెళ్లాను తప్పా మరో విధంగా కాదని, ఆమెకు ఎటువంటి హాని కలిగించే ప్రయత్నం తాను చేయలేదని వీడియోలో నవీన్ రెడ్డి పేర్కొన్నాడు. ఆమె అప్పటికీ ఒప్పుకోకపోవటంతో వారి స్నేహితులకు అప్పగించి అక్కడి నుంచి బళ్లారికి వెళ్లి అక్కడి నుంచి గోవాకు వెళ్లినట్లు వీడియోలో చెప్పుకొచ్చాడు. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు.