Telangana Assembly Election 2023: తెలంగాణలో కొనసాగుతున్న పోలింగ్, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్, ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలంటూ ప్రధాని ట్వీట్

రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలువురు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఉదయాన్నే చేరుకున్నారు.

Representational Image (File Photo)

Hyderabad, NOV 30: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Assembly Election 2023) మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలువురు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఉదయాన్నే చేరుకున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో బరిలో (election) నిలిచిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయించనున్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న చేపట్టనున్నారు. అదే రోజు సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వస్తాయి. పోలింగ్‌ నిర్వహణకు సుమారు 75 వేల మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ (PM MODI) కోరారు.

 

ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక మాద్యమం ఎక్స్ లో ఈ మేరకు ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాను’



సంబంధిత వార్తలు