Hyderabad City Buses: హైదరాబాదీలకు అలర్ట్.. మధ్యాహ్నం వేళ సగం సిటీ బస్సులకు బ్రేక్.. మొత్తం 2550 బస్సులకు నడిచేవి 1275 బస్సులే.. ఎందుకంటే?

ప్రతీరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సిటీ బస్సులను సగానికి సగం తగ్గిస్తున్నామని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

City Buses (Credits: X)

Hyderabad, Apr 16: హైదరాబాదీలకు (Hyderabad) ముఖ్య గమనిక. ప్రతీరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సిటీ బస్సులను (City Buses) సగానికి సగం తగ్గిస్తున్నామని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎండలు మండుతున్న వేళ ప్రయాణికులు అంతంతమాత్రమే ఉంటున్నారని.. బస్సులను ఖాళీగా తిప్పలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని టీఎస్‌ఆర్టీసీ వివరణ ఇచ్చింది.

Monsoon Rains: రైతులకు చల్లని కబురు.. ఈసారి సమృద్ధిగా వానలు.. సాధారణం కంటే అధిక వర్షపాతం.. ఐఎండీ అంచనా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మస్తు వానలు

ఏ సమయాల్లో ఎలా??

మొత్తం 2550 బస్సులకు 1275 అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఉదయం 5 నుంచి మొత్తం బస్సులు ఉంటాయని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకూ సగం బస్సులు నడుస్తాయని.. సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ అన్ని బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది.

Fire Accident: ప్రైవేట్ బస్సులో మంటలు.. దగ్ధమైన బస్సు.. కొంపల్లి డిలైట్ కిచెన్ ఎదురుగా అగ్ని ప్రమాదం (వీడియో వైరల్)



సంబంధిత వార్తలు