TGSRTC (Photo-X)

Hyderabad, Feb 23: వచ్చే బుధవారం (ఫిబ్రవరి 26న) మహాశివరాత్రి (Maha Shivarathri). ఈ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ఆర్టీసీ) ఈ నెల 24 నుండి నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను (Special Buses) నడపనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు మూడు వేల ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌ బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం.. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కేథలిక్ చర్చి అధిపతి

ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం శివరాత్రికి నడిచే ప్రత్యేక బస్సుల్లో ధరలను 50 శాతం మేర సవరించింది. రెగ్యులర్ సర్వీసుల టిక్కెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. 24 నుండి 28వ తేదీ వరకు నడిచే ప్రత్యేక బస్సుల్లో సవరించిన ఛార్జీలు అమలవుతాయని అధికారులు తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్, ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై వివరాలు అడిగిన ప్రధాని, కేంద్రం తరుపున సాయం చేస్తామని హామీ

ఏ క్షేత్రానికి ఎన్ని బస్సులంటే?

  • శ్రీశైలం 800
  • వేములవాడ 714
  • ఏడుపాయలు 444
  • కీసరగుట్ట 270
  • వేలాల 171
  • కాళేశ్వరం 80
  • వేములవాడ 51