NIIMS Hospital Record: ఛత్తీస్ గఢ్ గిరిజన యువకుడికి ప్రమాదవశాత్తూ ఛాతిలో దిగిన బాణం.. అరుదైన శస్త్ర చికిత్సను ఉచితంగానే చేసి నిండు ప్రాణాల్ని కాపాడిన హైదరాబాద్ నిమ్స్ వైద్యులు
ఛాతిలో బాణం దిగి ప్రాణాల కోసం పోరాడుతున్న గిరిజన యువకుడికి అరుదైన శస్త్ర చికిత్సను ఉచితంగానే చేసి ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు.
Hyderabad, May 26: హైదరాబాద్ (Hyderabad) లోని నిమ్స్ వైద్యులు (NIMS Doctors) అరుదైన ఘనత సాధించారు. ఛాతిలో బాణం (Arrow) దిగి ప్రాణాల కోసం పోరాడుతున్న గిరిజన యువకుడికి అరుదైన శస్త్ర చికిత్సను ఉచితంగానే చేసి ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా ఊనూర్ ప్రాంతానికి చెందిన సోది నంద (17) అనే గుత్తికోయ యువకుడు గురువారం అడవిలోకి వెళ్లాడు.ఈ క్రమంలో అతడికి ప్రమాదవశాత్తూ ఛాతిలో బాణం దిగింది. వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు.
ఢిల్లీలో ఘోరం.. అర్ధరాత్రి పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి (వీడియో)
గుండెలోని కుడి కర్ణికలోకి..
నిమ్స్ వైద్యులు తొలుత యువకుడికి సిటీ స్కాన్ చేశారు. ఊపిరితిత్తుల పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్టు గుర్తించారు. అప్పటికే భారీగా రక్తస్రావం కావడంతో యువకుడికి రక్తం ఎక్కిస్తూనే ఆపరేషన్ చేసి బాణాన్ని తొలగించారు. ఆపరేషన్ ఉచితంగా చేశామని కూడా వెల్లడించారు.
అలా చేసి ఉంటే ప్రాణాలు పోయేవే!!
బాణం దిగిన చోట రక్తం గడ్డకట్టడంతో యువకుడికి అధికరక్త స్రావం కాలేదని డాక్టర్లు చెప్పారు. దీంతో యువకుడి ప్రాణాలు నిలిచాయని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే యువకుడు బలవంతంగా బాణం బయటకు తీసి ఉంటే రక్తస్రావమై ప్రాణాలు పోయి ఉండేవని అన్నారు.