BJP Manifesto: తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో లీక్, అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత, ఇంకా ఏ యే ఉన్నాయంటే!

అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం ఇలా అన్ని అంశాల్లో వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఇప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టో విషయంలోనూ అదే సూత్రం పాటించింది. ఓటర్లను ఆకట్టుకునే విధంగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది.

Representational Image (File Photo)

Hyderabad, NOV 17: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం ఇలా అన్ని అంశాల్లో వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఇప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టో విషయంలోనూ అదే సూత్రం పాటించింది. ఓటర్లను ఆకట్టుకునే విధంగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీజేపీ మ్యానిఫెస్టో విడుదల కానుంది. కాగా, కమలం పార్టీ మ్యానిఫెస్టోలో కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. దశ (10) దిశ పేరుతో కాషాయ పార్టీ తన మ్యానిఫెస్టో విడుదల చేయనుందని సమాచారం.

బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ హామీలు ఉండే అవకాశం..

* ధరణి స్థానంలో మీ భూమి యాప్

* కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

* గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ

* రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై విచారణకు కమిషన్

* 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత

* సబ్సిడీపై విత్తనాలు, వరిపై బోనస్

* ఆడబిడ్డ భరోసా పథకం కింద 21ఏళ్లు వచ్చేసరికి రూ.2లక్షలు

* ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా 4 సిలిండర్లు

* మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు

* ఫీజుల నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ

* బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మినహాయింపులు

* ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

* నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ

* ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు

* PRCపై రివ్యూ.. ప్రతి ఐదేళ్లకు ఓసారి PRC

* జీఓ 317పై పునః సమీక్ష

* గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు

* ఐదేళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ది నిధి

* రోహింగ్యాలు, అక్రమ వలసదారుల పంపివేత

* తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు

* అన్ని పంటలకు పంట భీమా. భీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది

* ఐదేళ్లలో మహిళలకి ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు

* వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం

Telangana Assembly Elections 2023: నెలకు రూ. 4 వేలు ఫించన్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, పూర్తి వివరాలు ఇవిగో.. 

అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ జాతీయ నాయకత్వంతో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నామన్నారు. రానున్న వారం రోజుల పాటు.. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్, హేమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్ వంటి జాతీయ నాయకులు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు.

బహిరంగ సభలు నిర్వహిస్తున్నా.. ఇంటింటి ప్రచారాన్ని ఆపొద్దని అన్ని మండల శాఖలు, గ్రామ శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ పాలన వైఫల్యాలు, కుట్రలు, కుంభకోణాల గురించి.. కాంగ్రెస్ మోసపూరిత హామీల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించామన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో కూడా ఇంటింటికీ చేరేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

TGSRTC Special Buses For Sankranti: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ నుంచి 6,432 ప్రత్యేక బస్సులు.. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా? టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఏమన్నారు?

Telangana Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు పెట్టుబడి సాయం, రేషన్‌ కార్డులపై కేబినెట్ భేటీలో నిర్ణయం