Telangana Assembly Elections 2023: నెలకు రూ. 4 వేలు ఫించన్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
Congress president Mallikarjun Kharge releases party's poll manifesto

Hyd, Nov 17: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల హామీల బుక్‌లెట్‌ ‘అభయ హస్తం’ను విడుదల చేశారు. అభయ హస్తంలో 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌లో మరో 13 అంశాల్ని చేర్చి.. మొత్తం 42 పేజీలతో ఉంది టీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి‌‌,శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ ను సీఎం చేసినా నాకు ఓకే అంటున్న హరీశ్ రావు.. కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని స్పష్టీకరణ

ముందుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలతోపాటు 36 అంశాలను అందులో చేర్చారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవభృతి అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వీటితో పాటు వివిధ ఇతర అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ హామీలు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.

ఆరు గ్యారంటీలివిగో..

మహాలక్ష్మి: మహిళలకు ప్రతి నెల రూ.2500, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

రైతు భరోసా ప్రతి ఏటా: రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, వరిపంటకు క్వింటాలుకు రూ.500 బోనస్‌

గృహజ్యోతి: ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లులేని వారికి ఇంటి స్థలం-రూ.5లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.

యువ వికాసం: విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌.

చేయూత: రూ.4వేల నెలవారీ పింఛను, రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్య శ్రీ బీమా

Here's ANI Video

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రధానాంశాలు

వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్‌

తెలంగాణ ఉదమ్యకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.. గౌరవ భృతి

తొలి కేబినెట్‌లో మెగా డీఎస్సీ

మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు

గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం

రేషన్‌ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్‌

ప్రతి ఏటా రైతు భరోసా

రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు

వరి క్వింటాలుకు రూ.500 బోనస్‌

వ్యవసాయ కూలీలకు ఏడాది రూ.12,000

ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌

చేయూత పింఛన్‌ రూ. 4,000

ఇల్లు లేని వారికి ఇంటి స్థలానికి రూ.5 లక్షలు

విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు

కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ

మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2,500 ఖాతాలోకి

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్‌

వైద్య రంగం బడ్జెట్‌ పెంపు

ధరణి పోర్టల్‌ రద్దు.. ఆ స్థానంలో భూమాత పోర్టల్‌

రేషన్‌ ద్వారా సన్న బియ్యం

ఆర్టీసీ విలీన‍ ప్రక్రియ పూర్తి చేయడం

రూ. 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి

ఎన్నారై సంక్షేమ బోర్డు

దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్‌

ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

ప్రతీ మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌.

చేయూత పెన్షన్‌ రూ.4వేలు

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల ఖాతాలో రూ.2500

రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌

నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం

ఖమ్మం, ఆదిలాబాద్‌ నూతన విశ్వవిద్యాలయాలు

కొత్త రేషన్‌ కార్డులు జారీ

ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేల సాయం

పోటీ పరీక్షలకు ఫీజు రద్దు

సీఎం కార్యాలయంలో ప్రతీరోజు ప్రజా దర్బార్‌.. ఇలా ఇంకా ఉన్నాయి..